
మచిలీపట్నం: టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ప్రజలు టీడీపీని మర్చిపోతారనే భయంతో రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఇచ్చే పిలుపులకి స్పందన కరువైంది. దత్తపుత్రుడు, లోకేష్ ప్రజల సమస్యలపై మాట్లాడటం మానేశారు. టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరు. టీడీపీ పిలుపునకు నియోజకవర్గానికి పదిమంది మాత్రమే వస్తున్నారు. పవన్ ఆవనిగడ్డ సభ ఫ్లాప్ అయ్యింది. పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది, వారాహి ఫ్లాప్ అవ్వడంతో దానికి పవన్ ప్యాకప్ చెప్పేశారు. సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ ప్రజలకు చేరువైన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.’ అని తెలిపారు మంత్రి జోగి రమేష్.
కులాల పేరుతో దౌర్జన్యం చేస్తారా?
ఆర్థిక నేరాలకు పాల్పడ్డ చంద్రబాబును అరెస్ట్ చేస్తే కులాల పేరుతో దౌర్జన్యం చేస్తారా? అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు. మధ్య పానం పెడితే తప్పా.. అంటూ ఆనాడు ఎల్లో మీడియా రాసింది. మద్యపానం నిర్మూలించినది ఎన్టీఆర్ . ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన పదవి లాక్కొని ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారు. 1998 లో మధ్యపాననిషేధం ఎత్తి వేయక పోతే ప్రభుత్వం నడపలేమని చంద్రబాబు ప్రకటించి ఎత్తివేశారు. గుడి బడి అని చూడకుండా 4378 ప్రవేట్ వైన్ షాప్‌లు, 43వేల బెల్ట్ షాప్‌లు పెట్టారు.ప్రెసిడెంట్ మెడల్, డీలక్స్ విస్కీ, గవర్నర్ విస్కీ, బూమ్ బూమ్ బీర్ 2017లో చంద్రబాబు పాలనలో అనుమతి ఇచ్చారు’ అని తెలిపారు నారాయణస్వామి.
Comments
Please login to add a commentAdd a comment