
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.

తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు.