మైనర్‌ బాలికతో కానిస్టేబుల్‌ అదృశ్యం! | Constable Run Away with Minor Girl | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 11:05 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable Run Away with Minor Girl - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కానూరులో మైనర్ బాలికతో కానిస్టేబుల్ అదృశ్యం కావడం తీవ్ర అలజడి రేపుతోంది. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి హరి - ఇంటర్ చదువుతున్న బాలికపై కన్నేశాడు. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ తనను ముగ్గులోకి దింపా. ఈ క్రమంలోనే కాలేజీకి వెళ్లిన బాలికను తన వెంట తీసుకొని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురి జాడ తెలపాలని ఫిర్యాదు చేశారు. బాలిక వయస్సు 17 ఏళ్లు కావడంతో - కానిస్టేబుల్ బండి హరిపై  ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారి జాడ కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement