టీడీపీలో పొత్తు చిచ్చులు తెచ్చిపెడుతోంది. కృష్ణా జిల్లా నాయకులు విజయవాడ వెస్ట్, కైకలూరు నియోజకవర్గాల విషయంలో నాయకులు జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు.
టీడీపీలో పొత్తు చిచ్చులు తెచ్చిపెడుతోంది. పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, కైకలూరు నియోజకవర్గాలను పొత్తులో భాగంగా కమలదళానికి చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి బీజేపీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
దీంతో టీడీపీ నాయకులు ఈ స్థానం విషయమై భగ్గుమంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ముస్లిం మైనారిటీలకు కేటాయించాలి తప్ప బీజేపీకి పొత్తులో వదలకూడదని డిమాండ్ చేస్తున్నారు. కైకలూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని కూడా అక్కడి నేతలు అంగీకరించడంలేదు. దీంతో ఇరుపార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఏమాత్రం సత్ఫలితాలు ఇస్తుందన్నది అనుమానంగానే మారింది.