Andhra Pradesh Election Updates 5th May...
07:50 PM, May 5th, 2024
తాడేపల్లి :
టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన వైఎస్సార్‌సీపీ
- ల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్
- పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
- చాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్‌ని మెచ్చుకున్న పయ్యావుల
- 2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావుల
- ఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి
07:20 PM, May 5th, 2024
టీడీపీ ఆఫీస్‌కి సీఐడీ టీమ్
టీడీపీ ఆఫీస్‌లో ఎవరూ లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు
06:57 PM, May 5th, 2024
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బదిలీ
- డీజీపీని వెంటనే బదిలీ చేయాలని సీఎస్‌కు ఈసీ ఆదేశాలు
ముగ్గురు డీజీ ర్యాంకు అధికారులు పేర్లు పంపాలని సీఎస్‌కు ఆదేశం
04:50 PM, May 5th, 2024
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జల
- చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుంది
- ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారు
- సర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశఫెట్టాం
- పోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉంది
- కేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది
- సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారు
- పోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్ షాకు తెలుసు
- కావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలి
- ఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుంది
- కూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారు
- చంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారు
- పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు
04:30 PM, May 5th, 2024
కాకినాడ:
అధికారం కోసం ప్రజలను మోసం చేయాలన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి
- పొత్తులో ఉన్న బీజేపీ పార్టీయే చంద్రబాబును నమ్మడం లేదు
- కాకినాడ పోర్టులో ఏది ఎగుమతి అవుతుందో చంద్రబాబుకు తెలియదా?
- కాకినాడ పేరుకు దేశంలో మంచి పేరు ఉంది
- 2014 ఎన్నికల కు ముందు అప్పులు పాలైనపోయిన వ్యక్తి..మాజీ ఎమ్మెల్యే కొండబాబు.
- 2019 నాటికి అవినీతితో ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి కొండబాబు
- క్రికెట్ బుకీలో దిట్ట మీ కూటమీ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
- ఒక సెంటు నేను కాకినాడలో కబ్జా చేశానని నిరూపిస్తే.. నా ఆస్ధి ప్రజలకు రాసిచ్చేస్తాను
- కొండబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గా వస్తే మళ్ళీ కాకినాడలో గంజాయి , కబ్జాలు ,అవినీతి పెరిగిపోతుంది
- రూ.1,000 కోట్లు ఓఎన్జీసి నా ఎకౌంట్ లో నష్టపరిహారం సొమ్ములు వేసిందని మత్స్యకారులకు కొండబాబు మాయ మాటలు చెబుతున్నారు.
- ఓఎన్జీసి నుండి సమాచార హక్కు క్రింద సమాచారం తీసుకున్నాను. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను
- అలాగే దీనిపై కొండబాబుపై పరువు నష్ట దావా వేస్తున్నాను
04:15 PM, May 5th, 2024
తాడేపల్లి
ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
- ఏపీలో 6 వేల పంచాయతీలలో భూ సర్వే జరిగింది.
- చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.
- వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.
- 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్.
- ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు
- ఏపీలో బీజేపీ కేంద్ర నాయకులు పర్యటన చేస్తున్నారు
- ఈ యాక్టును అమలు చేయనివ్వద్దొని కేంద్ర పెద్దలను అడిగే దమ్ము చంద్రబాబు, పవన్ కి ఉందా?
- పురేందేశ్వరి ఈ యాక్టు కరెక్టే అని అన్నారు.
- పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలి
- పోలవరం డబ్బును ఎటిఎంలా చంద్రబాబు వాడుకున్నాడని మోదీనే గతంలో అన్నారు
03:30 PM, May 5th, 2024
చిత్తూరు జిల్లా:
చిత్తూరులో పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు
విజయానంద రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలుకు నగదు పంచుతున్న ఇద్దరినీ పట్టుకుని వన్ టౌన్ లో లక్షన్నర నగదుతో అప్పగిస్తే వదిలేశారు
- అందుకే స్టేషన్ ముందు అర్ధనగ్న నిరసన చేస్తున్నా
- 500 మంది బెంగుళూరు,,అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారు
- పోలీసులు పట్టించుకోవడం లేదు
02:20 PM, May 5th, 2024
తాడేపల్లి :
,భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబు
- వారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారు
- మోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారు
- దీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలి
- లేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలి
- జనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
- ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు
- ప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారు
- పేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్
- ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్‌ది
- చుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్
- అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- టీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోంది
- తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు
01:42 PM, May 5th, 2024
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
- చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం
- టీడీపీ అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
- ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ
- చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు
- ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదు
12:15 PM, May 5th, 2024
చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
- 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదు
- ల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?
- సభల్లో వైఎస్సార్‌సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదు
- బీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?
- నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలి
- మోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలి
- కూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదు
- కూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతం
- అవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు
10:59 AM, May 5th, 2024
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి..
- బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తా
- ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలి
- షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి
- నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు
- వైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?
- వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు
- వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు
- షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు
- రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది
- వైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది
- సీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు
- షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుంది
- వైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది
- షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు
- తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధం
- బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది
- వైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం
- ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి
- షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది
10:59 AM, May 5th, 2024
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
- ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- మా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది
- చర్యలకు సీఐడీకి సిఫారసు చేసింది
- ప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం
- సీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
- తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవు
- ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదు
- నీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది
- టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?
- కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది?
- ఏపీల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి
10:51 AM, May 5th, 2024
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి
- భూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లం
- ఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుంది
- ఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదు
- ఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసింది
- జనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదు
- చంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలి
- చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి
- ఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుంది
- అందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు
8:56 AM, May 5th, 2024
నేడు ఏపీకి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
- శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్‌బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్‌షా
- వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్ సింగ్
8:51 AM, May 5th, 2024
అవన్నీ అపోహలే
- ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణ
- ఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది
- అన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులే
- ఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుంది
- హక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావు
- అందుకే ఈ చట్టం అవసరమవుతోంది
- భూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్
7:37 AM, May 5th, 2024
జనం.. జనం.. ప్రభంజనం
- సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకం
- హిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనం
- నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథం
- ఈసారి హిందూపురం వైఎస్సార్‌సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులు
- పలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలు
- నెల్లూరులో జననీరాజనం
7:25 AM, May 5th, 2024
ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడా
- దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు
- ప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్
- ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు
- వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్
- తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం
7:16 AM, May 5th, 2024
కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలో
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలు
- లేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం
- కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందన
- రిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?
- చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?
- రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపు
- పైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యం
- ఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్
- అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..
- అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!
- అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రం
- మోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబు
- బాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీ
- జనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధం
- పోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదు
- మిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద
7:14 AM, May 5th, 2024
బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగం
- బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగం
- ఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రం
- లబ్ధిదారుల నమోదు పేరిట కుట్ర
- ఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగం
- తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్
- ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
7:12 AM, May 5th, 2024
లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..
- నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపు
- సీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన
- వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారం
- చుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి
- 27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు
- లంక భూములకు అసైన్‌మెంట్ పట్టాలు
- కుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారం
- నిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ
- శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలు
- కొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్
- చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్
- రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం
- అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు
6:59 AM, May 5th, 2024
మళ్లీ దోపిడీకి తెరపైకి..
- మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!
- గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు
- వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడు
- టిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటం
- ప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర
- బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలే
- ఏకంగా పది క్రిమినల్ కేసులు
6:56 AM, May 5th, 2024
మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్
- చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటు
- మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..
- రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు
- అన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు
- భూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వే
- పేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే
Comments
Please login to add a commentAdd a comment