
సాక్షి, బెంగళూరు : కర్ణాకటకలో 14 నెలల పాటు కొనసాగిన కుమారస్వామి ప్రభుత్వం.. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కుమారస్వామి ప్రవేశ పెట్టిన తీర్మాణానికి 99 మంది అనుకూలంగా మద్దతు ఇవ్వగా.. 105 మంది వ్యతిరేకించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాలేదు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించనా.. ఓటింగ్‌లో పాల్గొనకపోవడం పట్ల పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు.
(చదవండి : కుమార ‘మంగళం’)
మాయావతి నిర్ణయంపై ఎమ్మెల్యే మహేశ్ స్పందింస్తూ.. తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అర్థం కావడంలేదన్నారు. తాను ఓటింగ్‌లో పాల్గొనడంలేదని ముందే చెప్పానని, అయినప్పటికీ ఎందుకు బహిష్కరించారో తెలియడం లేదన్నారు. మయావతి ట్వీట్ గురించి తనకు తెలియదని, ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. కాగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పినా.. పార్టీ నియమామలను ఉల్లంఘిస్తూ మహేశ్ సభకు హాజరుకాలేదని అందుకే అతన్ని బహిష్కరిస్తున్నాని మాయావతి ట్వీట్ చేశారు.
(చదవండి : కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు)
2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్‌లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్‌కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment