రాహుల్‌పై విమర్శలు.. రాజీనామా
కొల్లం: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళ యువజన కాంగ్రెస్ నేత సీఆర్ మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిపై విమర్శలు చేయడంపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించింది. బుధవారం మహేష్‌ను సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, సస్పెన‍్షన్ వార్త బయటకు రాక ముందే రమేష్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోవటం లేదని తెలిపారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున‍్నట్లు తెలిపారు.
2016 ఎన్నికల్లో కొల్లం నుంచి పోటీ చేసిన ఆయన సీపీఎం అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా, మంగళవారం రమేష్ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా రాహుల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం చేతకాకుంటే వైదొలగాలని కోరారు. అలాగే, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత ఏకే ఆంటోనీని మౌన మునిగా అభివర్ణించిన విషయం విదితమే.