
‘రంగస్థలం’ ఫేమ్ మహేశ్ ఆచంట ఓ ఇంటి వాడయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేశ్.. తన సమీప బంధువుల అమ్మాయి పావనిని గురువారం పెళ్లి చేసుకున్నాడు. గత కొద్దిరోజుల క్రితమే పావనితో నిశ్చితార్థం చేసుకున్న మహేశ్ లాక్‌డౌన్ సమయంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రభుత్వ లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ నటుడి వివాహం జరిగింది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సాధించిన మహేశ్ ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబు స్నేహితుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శతమానం భవతి, మహానటి చిత్రాలతో నటుడిగా స్థిరపడిపోయాడు. ఇక ఇదే రోజు యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చదవండి:
ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్
పవన్ కల్యాణ్.. ‘డ్రైవింగ్ లైసెన్స్’?
Comments
Please login to add a commentAdd a comment