
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తన తప్పులకు శిక్ష పడుతుందేమోనని భయపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేజీలకు పేజీలు లేఖలు రాసి భయపెట్టే ప్రయ త్నం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
విద్యుత్ ప్రాజెక్టులు, కొనుగోళ్ల విషయంలో విచా రణ జరుపుతున్న కమిషన్‌కు 12 పేజీల లేఖ రాసే బదులు కమిషన్ ముందుకు వెళ్లి తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ చేసిన తప్పులు ఒప్పుకుని విచారణకు సహకరించాలని, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన కుంభకోణం, అక్రమాలు ప్రజలకు తెలియాలని శనివారం విలేకరులతో మాట్లాడుతూ మహేశ్‌గౌడ్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment