మా పిల్లల తప్పేమీ లేదు | harish and rajesh family reactions in Hawala case | Sakshi
Sakshi News home page

మా పిల్లల తప్పేమీ లేదు

Published Sun, May 14 2017 3:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

harish and rajesh family reactions  in Hawala case

► హవాలా కేసు నిందితుల తల్లిదండ్రులు

విశాఖపట్నం: హవాలా కేసులో విశాఖపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్న పెరవలికి చెందిన ఆచంట రాజేష్, హరీష్‌ల తప్పేమీ లేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే వీరి తండ్రి జయకృష్ణ పెరవలిలో రాయల్ హోటల్‌ను నడిపేవారు. నష్టాలు రావడంతో దానిని కొంతకాలంగా మూసివేశారు. దీంతో హరీష్, రాజేష్‌లు ఖాళీగా ఉంటున్నారు.

ఈ క్రమంలో హవాలా కేసులో అసలు సూత్రధారిగా భావిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన మహేష్ తండ్రి వీరికి రూ.20 వేలు జీతం ఇస్తానని వారిని తీసుకెళ్లారని హరీష్‌, రాజేష్‌ల తల్లిదండ్రులు వివరించారు. ఇటీవలే వారు అక్కడ మానేసి వచ్చేసారని, ఇపుడు పోలీసులు కేసులు అంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుల తప్పేమీ లేదంటున్న తల్లితండ్రులు మీడియాతో మాట్లడటానికి నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement