ఆన్‌లైన్ వేధింపుల కేసులో నిందితుడి అరెస్టు
సిటీబ్యూరో: యువతిని ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేస్తున్న నగరానికి చెందిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తన వ్యక్తిగత ఫొటోలను నకిలీ ఫేస్‌బుక్ ఖాతా క్రియేట్ చేసి అందులో పోస్టు చేస్తూ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ జూనియర్ సివిల్ జడ్జి ఫిర్యాదు మేరకు రామంతపూర్‌కు చెందిన మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైబర్‌క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం...2010లో నిందితుడు మహేశ్ బాధితురాలితో కలిసి జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తున్న సమయంలో వారికి పరిచయం ఏర్పడింది.
దీనిని అలుసుగా తీసుకున్న అతను ఫోన్‌లో మాట్లాడాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో మహేశ్ బాధితురాలి ప్రతిష్టను దిగజార్చేందుకుగాను ఆమె పేననకిలీ ఫేస్‌బుక్ ఖాతాను క్రియేట్ చేసి ఆమె వ్యక్తి గత ఫొటోలు పోస్టు చేశాడు. బాధితురాలి ఫిర్యాదువ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.