ఫేస్‌బుక్‌లో యువతికి అసభ్యకర పోస్ట్‌ | Software Engineer Arrested Over Harassment Woman on Facebook At Hyderabad | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో యువతికి అసభ్యకర పోస్ట్‌

Published Thu, Nov 4 2021 6:40 PM | Last Updated on Thu, Nov 4 2021 6:58 PM

Software Engineer Arrested Over Harassment Woman on Facebook At Hyderabad - Sakshi

సాయికుమార్‌

బోడుప్పల్‌ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి మ్యాట్రీమోనిలో తన పేరును నమోదు చేసుకుంది. ఇది గమనించిన సాయికుమార్‌..

సాక్షి, ఉప్పల్‌: ఫేస్‌బుక్‌లో ఓ యువతికి అసభ్యకర మెసేజ్‌లు పోస్ట్‌ చేసిన ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ మక్బుల్‌ జానీ వివరాల ప్రకారం.. బోడుప్పల్‌ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి మ్యాట్రీమోనిలో తన పేరును నమోదు చేసుకుంది.

ఇది గమనించిన నెల్లూరు ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సువనం సాయికుమార్‌ (29), యువతి తల్లిదండ్రులతో మాట్లాడి కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి చూపులకు వెళ్లగా నచ్చకపోవడంతో నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న సాయికుమార్‌ యువతి ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టి ఇబ్బందులకు గురి చేసాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయికుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.  
(చదవండి: ఘరానా మోసం.. ఐటీ అధికారినంటూ టోకరా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement