
మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆదివారం మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం చెందిన చంద్రయ్య కుమారుడు జయకృష్ణ(12) శామీర్‌పేటలో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చంద్రయ్య సొంత అన్న జెనిగె రాములు కుమారుడు జనిగె మహేష్(20) హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
జయకృష్ణను హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి తిరిగి హాస్టల్‌లో వదిలేందుకు జయకృష్ణ తనకు చెందిన బైక్‌పై వెళ్తుండగా బాబాగూడ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంట్ స్తంభానికి ఢీకొట్టింది. జయకృష్ణ, జనిగె మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment