
మహేష్ (ఫైల్ పొటో)
సాక్షి, విజయవాడ: బెజవాడలో కలకలం రేపిన సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అతని స్నేహితుడు హరికృష్ణపై మహేష్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ సోదరి సునీత మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడిని పక్కా పథకంతో హతమార్చారని తెలిపారు. పొలాల మధ్యలో మిత్రులతో కలిసి మహేష్ ఉన్నాడన్న విషయం తెలుసుకొని హరి అక్కడకు వెళ్లాడని చెప్పారు. ఇంటికి వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో మళ్లీమద్యం సేవిద్దామని మహేష్‌ని హరి ఆపాడని అన్నారు. డబ్బులు పేటిఎం చేసి మద్యం కొనుక్కురమ్మని ఇద్దరు వ్యక్తులను బలవంతంగా పంపాడని తెలిపారు. చదవండి: విజయవాడ నగర శివారులో దారుణ హత్య
మద్యం తీసుకురావడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్లిన తర్వాత మరో ఇద్దరు వచ్చి తన తమ్ముడుపై కాల్పులు జరిపారని ఆమె చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తులు వెళ్లడానికి హరి కారును రివర్స్ చేసి మరీ ఇవ్వటంపై పలు అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. హరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. ప్రేమ వ్యవహారం అని అందరూ అంటున్నారని, అది తప్పుడు సమాచారమన్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలు ఉన్నాయన్నది కూడా నిజం కాదని సునీత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment