ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ‘హాఫ్ స్టోరీస్’ | Half Stories Movie To Release On 7th January | Sakshi
Sakshi News home page

ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ‘హాఫ్ స్టోరీస్’

Published Thu, Jan 6 2022 7:06 PM | Last Updated on Thu, Jan 6 2022 7:06 PM

Half Stories Movie To Release On 7th January - Sakshi

రాజీవ్, `రంగస్థలం` ఫేమ్ మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం  'హాఫ్ స్టోరీస్'.  శివవరప్రసాద్ కె. దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై యం. సుధాకర్ రెడ్డి నిర్మించారు. . కోటి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు అతిథి పాత్రలో నటించడం విశేషం. తాజాగా అన్ని పనులు పూర్తి చేసుకుని జనవరి 7  న విడుదల కావడానికి సిద్ధమవుతుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు శివ వరప్రసాద్ కె మాట్లాడుతూ..డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన హాఫ్ స్టోరీస్ సినిమా ను జనవరి 7 వ తేదీన విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎంతో కష్టపడి ఈ సినిమా ను తెరకెక్కించాం. డిఫరెంట్  కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ఈ సినిమా ఉంటుంది. అందరు ఈ సినిమా ను చూడాలని ఆశిస్తున్నాను అన్నారు. 

నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ సినిమాకు కూడా వస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నాం. జనవరి 7 ఈ సినిమా అందరి ముందుకు రాబోతుంది. మీ అందరిని ఈ సినిమా అలరిస్తుంది. దర్శకుడు మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కించాడు. కోటి సంగీతం సినిమాకి  హైలైట్. అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement