Rangasthalam Mahesh Signs Pan India Star Films - Sakshi
Sakshi News home page

Rangasthalam Mahesh: స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్న రంగస్థలం మహేశ్‌

Published Sat, May 6 2023 9:11 PM | Last Updated on Sat, May 6 2023 9:17 PM

Rangasthalam Mahesh Upcoming Films - Sakshi

అగ్ర హీరోలతో పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లోని పలు క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన

బుల్లితెరపై కమెడియన్‌గా కనిపించిన మహేశ్‌ సిల్వర్‌ స్క్రీన్‌పైనా నటుడిగా తన సత్తా చాటుకున్నాడు. కామెడీతో నవ్వించడమే కాదు.. ఎమోషనల్‌ సీన్స్‌లో నటించి ఏడిపించగలరు. ఇక విలనిజాన్ని కూడా ప్రదర్శించగలరు. అలా విభిన్న పాత్రలతో ఆడియెన్స్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేశ్‌ కెరీర్‌ను రంగస్థలం ఒక్కసారిగా మార్చేసింది. రంగస్థలం సినిమానే తన ఇంటి పేరు అన్నంతగా మారిపోయింది. ఆ చిత్రం తరువాత మహేశ్‌ కాస్తా.. రంగస్థలం మహేశ్‌ అన్నట్టుగా మారిపోయింది.

ఇప్పుడీ నటుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అగ్ర హీరోలతో పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లోని పలు క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన నటిస్తున్నాడు. మహేశ్‌ బాబు- త్రివిక్రమ్ కాంబోలో, అలాగే మారుతి ప్రభాస్ - కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాల్లో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. 

కళ్యాణ్‌ రామ్ డెవిల్ ప్రాజెక్టులోనూ మహేశ్‌ కనిపించనున్నాడు. ఇలా టాలీవుడ్‌లోని క్రేజీ ప్రాజెక్టుల్లో ఆఫర్లు దక్కించుకుంటూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కమెడియన్, ఆర్టిస్టుగా అన్ని రకాల క్యారెక్టర్లు వేస్తూ నటుడిగా దూసుకుపోతోన్నాడు రంగస్థలం మహేశ్‌.

Sticky for cinema

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement