52 దేశాల ఎన్నారైల మద్దతు బీఆర్‌ఎస్‌కే | NRIs Support Bharat Rashtra Samithi: Mahesh Bigala | Sakshi
Sakshi News home page

52 దేశాల ఎన్నారైల మద్దతు బీఆర్‌ఎస్‌కే

Published Mon, Oct 10 2022 1:18 PM | Last Updated on Mon, Oct 10 2022 1:18 PM

NRIs Support Bharat Rashtra Samithi: Mahesh Bigala - Sakshi

మహేష్‌ బిగాల

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితికి ప్రపంచంలోని 52 దేశాల ఎన్నారైలు మద్దతు ప్రకటించారని గ్లోబల్‌ బీఆర్‌ఎస్‌ ఎన్నారై కో–ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఎన్నారై ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా... కేసీఆర్‌ దసరా రోజు తీసుకున్న బీఆర్‌ఎస్‌ ఏర్పాటు నిర్ణయాన్ని ఆయా దేశాల ఎన్నారై ప్రతినిధులు స్వాగతించారని తెలిపారు. తెలంగాణతోపాటు మిగిలిన రాష్ట్రాల ఎన్నారైలు సైతం మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. 

కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎన్నారైలు భావిస్తున్నారని, బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో కేసీఆర్‌ అడుగుజాడల్లో ముందుకెళ్తామని ఎన్నారైలు పేర్కొన్నట్లు మహేష్‌ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నారైల మద్దతు బీఆర్‌ఎస్‌కే ఉందని స్పష్టం చేశారు. (క్లిక్‌: కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చిన కోమటిరెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement