
జగిత్యాలక్రైం: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో జగిత్యాల జిల్లా విద్యానగర్‌కు చెందిన మేడిశెట్టి మహేశ్(24) మంగళవా రం హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీఏ పూర్తి చేసిన మహేశ్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నరేశ్ అనే వ్యక్తి రూ.2 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు.
ఆరు నెలలుగా అతను ఉద్యోగం చూపించకపోవడంతో మనస్తాపానికి గురైన మహేశ్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కాగా, మహేశ్ స్వగ్రామంలో సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని ఉంచడానికి నిరాకరించారు. దీంతో శవాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా గొల్లపల్లి రోడ్‌లోని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతుడి తండ్రి మూడేళ్లక్రితం ఆత్మహత్య చేసుకోగా.. తల్లి పద్మ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment