‘మా ఊరి సిన్మా’వచ్చేస్తుంది | Maa Oori Sinma Movie Update | Sakshi
Sakshi News home page

‘మా ఊరి సిన్మా’వచ్చేస్తుంది

Published Sat, Sep 2 2023 5:20 PM | Last Updated on Sat, Sep 2 2023 5:49 PM

Maa Oori Sinma Movie Update - Sakshi

పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా  శివరాం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా ఊరి సిన్మా’. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై మంజునాధ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ..‘మా ఊరి సిన్మా’ కొంతమంది చూపించాం. వారంతా బాగుందని అభినందిస్తూ  ఉంటే ఆనందంగా ఉంది. మేము చేసిన ఈ ప్రయత్నం  ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను’ అన్నారు .

చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ‘మా సినిమా కోసం మా టీమ్ చాలా కష్ట పడ్డారు. వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు.

హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ ‘ మా సినిమాలో తండ్రి కొడుకుల అనురాగం ఉంది. బావ మరదళ్ల ఆప్యాయత ఉంది. అన్ని ఎమోషన్స్ మా చిత్రం లో ఉన్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను ’అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామ కృష్ణ (శ్రీధర్), ప్రముఖ నటులు నాగ మహేష్, బలగం సంజయ్ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement