pulivendhula
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పులివెందుల వెళతారు. 3 రోజులపాటు పులివెందులలోనే అందుబాటులో ఉంటారు. -
ఇంత అరాచకమా..? చంద్రబాబు సర్కార్‌పై అవినాష్‌రెడ్డి ఫైర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అరాచక పాలన సాగుతోందని.. వందరోజుల్లోనే చంద్రబాబు సర్కార్ అసంతప్తి మూటగట్టుకుందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిలెటిన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏ నరసింహను చంపారన్నారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. పులివెందులలో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది’’ అని అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు.పులివెందులతో పాటు జిల్లా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేంది. పులివెందులలో అభివృద్ధి, సంక్షేమం తప్ప ఇలాంటి సంస్కతి లేదు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం వినియోగంలోకి తేవాలి’’ అని అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!‘‘పులివెందులలో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజీకి కూటమి ప్రభుత్వం అడ్మిషన్లు రాకుండా చేసింది. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దు’’ అని అవినాష్‌రెడ్డి హితవు పలికారు. -
పులివెందులకు వైఎస్ జగన్.. ప్రజల సాదర స్వాగతం
Updates..👉పులివెందులలో క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి👉వైఎస్ జగన్‌ను కలిసేందుకు తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు👉కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 👉రోడ్డు మార్గంలో వెళ్తున్న జగనన్నకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రతీ గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారు. 👉తనను అప్యాయంగా పలకరిస్తున్న ప్రజల కోసం తన వాహనాన్ని ఆపుతూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. 👉జగన్నన రాక నేపథ్యంలో బాణాసంచా కాల్చుతూ సాదర స్వాగతం పలుకుతున్నారు. 👉కడప చేరుకున్న వైఎస్ జగన్ 👉వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి కడపకు బయలుదేరారు. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లనున్నారు. 👉కాగా, వైఎస్ జగన్ మూడు రోజుల పాటు పులివెందుల పర్యటనలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇక, గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్ రాక సందర్భంగా జై జగన్ నినాదాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. -
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్‌కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్‌ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్‌రెడ్డి, వైఎస్ మధుకర్‌రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్‌రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్‌రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్‌రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్‌రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Pulivendula : ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్
సాక్షి, విజయవాడ: ఏప్రిల్ 25, గురువారం.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేయబోయే రోజు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం నామినేషన్‌కు ముహూర్తాన్ని ఖరారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ నెల 25, గురువారం రోజున పులివెందులలో సీఎం జగన్ స్వయంగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సుయాత్ర ముగించుకొని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు సీఎం. అదే విధంగా ఈ నెల 22న సీఎం జగన్ తరుపున వైఎస్ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల 110 ఓట్ల మెజారిటీతో వైఎస్ జగన్ గెలుపొందారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టి 15 ఏళ్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 15 ఏళ్లు దాటుతోంది. 2009లో కడప లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత ఓదార్పు యాత్రతో జనంలోకి వెళ్లిన వైఎస్ జగన్.. ఆ యాత్రను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో కడప ఎంపీ స్థానానికి జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ ఏకంగా 5 లక్షల 45వేల 672 ఓట్ల తేడాతో గెలిచి రికార్డులు బద్దలు కొట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్, 75వేల 243 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2019లోనూ పులివెందుల నుంచే పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 90 వేల 110 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించే అవకాశం ఉంది. ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. -
Viveka Case : సత్యమేవ జయతే
వివేకా హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి నిజాలను దాస్తున్నారా. అసలు వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారా. నిజాలు బయటకు వస్తే సునీతారెడ్డి దంపతులు కేసులో ఇరుక్కోవడం ఖాయమా. అసలు వివేకా హత్యకేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలేంటి… సునీతారెడ్డి చేస్తున్న అబద్ధపు ప్రచారం ఏంటి? వివేకా హత్యకేసులో కుమార్తె సునీతారెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోంది. ఓ వైపు తన తండ్రి హంతకులను పట్టుకోవాలని చెబుతున్న సునీతా…మరోవైపు కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కుట్రలు చేస్తోంది. ఇప్పటికే విచారణ పూర్తయిన ఈ కేసులో సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పాత్రపై ఎన్నో అనుమానాలున్నాయి. హత్య జరిగినప్పటి నుంచి ఈ దంపతుల తీరు… సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించిన వైనంపై ఇప్పటికీ పూర్తి విచారణ జరగలేదు. సీబీఐ అధికారులతో కలిసి సాక్ష్యులను బెదిరించడానికి సునీతారెడ్డి దంపతులు చేసిన ప్రయత్నాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో MP అవినాష్‌రెడ్డిని ఇరికించేందుకు యత్నించిన సునీతారెడ్డి… ఇప్పుడు వారిపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్దికోసమే ఈ కేసును సునీతారెడ్డి వాడుకుంటున్నారనే దానికి ఆమె ప్రకటనలే సజీవసాక్ష్యాలు. గత ఐదేళ్లలో వివేకా హత్య కేసును జాగ్రత్తగా పరిశీలిస్తే… వివేకా హత్యకు సంబంధించి సునీతారెడ్డి దంపతులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది సునీత దంపతులు కాదా? షమీమ్‌ను వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకుంటే… ఆయనతో సునీతకు, నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి గొడవలు ఉన్న మాట వాస్తవం కాదా? షమీమ్ కొడుకుకు ఆస్తిలో వాటా వస్తోందనే భయంతోనే తప్పుడు సాక్ష్యం చెప్పాలని PA కృష్ణారెడ్డిని బెదిరించారా? వివేకా చెక్ పవర్ తీసేసి ఆయనను ఆర్ధికంగా తీవ్ర ఇబ్బంది పెట్టింది సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కాదా? అవినాష్‌రెడ్డి పేరు చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజమా కాదా? వివేకానంద రెడ్డిని నరికానని బాహాటంగా ప్రకటించిన దస్తగిరి బెయిల్‌కు సునీత సహకరించిందా? లేదా? హత్య గురించి సుదీర్ఘ ప్రకటనలు చేస్తున్న వారు వివేకా రెండో పెళ్లి గురించి, ఆస్తుల సెటిల్మెంట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వివేకా హత్య తర్వాత ఆస్తులన్నీ హడావిడిగా మీ పేరిట ఎందుకు మార్చుకున్నారు? రాజకీయ ఆకాంక్షతోనే TDPకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారా? మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని PA కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. పీఏ కృష్ణారెడ్డి హత్య విషయం తెలియగానే ముందుగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఉదయం 6 గంటల 18నిమిషాలకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కేవలం కొన్ని సెకన్ల పాటు జరిగిన ఈ ఫోన్ సంభాషణలో … వివేకా బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు అని పీఏ కృష్ణారెడ్డి… వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్‌ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వీరంతా పులివెందుల చేరుకున్న తర్వాతే సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్ చేసి వాటిని పోలీసులకు అప్పగించారనే చర్చ ఉంది. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. నిజం తెలిసిన తరువాత కూడా ఎందుకు వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి అబద్ధం చెప్పారు. లేఖను దాచిపెట్టారు అనేది తేలితే కేసు సగం కొలిక్కి వచ్చినట్లే. వివేకా హత్యకేసులో మరో కీలకమైన అంశం ఆయన రెండో వివాహం. షమీమ్ అనే మహిళను 2010లో వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. వివాహం పూర్తిగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగింది. తన పేరును అక్బర్‌గా మార్చుకున్న వివేకా షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై వివేకా కుమార్తె, అల్లుడు, బావమరిది ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె సునీతారెడ్డికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ విషయం కారణంగానే దాదాపు 2013 నుంచి సునీతారెడ్డి తండ్రితో మాట్లాడడం లేదని ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు. వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయనే వాదన ఉంది. తన రెండో భార్య ద్వారా జన్మించిన కుమారుడిని వివేకా వారసుడిగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా రెండో భార్య షమీమ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. తన కొడుకుకు ఆస్తిలో వాటా ఇస్తానని వివేకా చెప్పినట్లు షమీమ్ తన వాంగ్మలంలో చెప్పారు. తన కొడుకుకు ఆస్తి వస్తుందనే కారణంతో వివేకా మొదటి భార్య కుటుంబం తనపై కక్ష్య గట్టిందని… చాలాసార్లు తనను బెదిరించినట్లు షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు వివరించారు. ఇక ఎర్రగంగిరెడ్డిని తమ ఇంటికి పంపి… వివేకాతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని బెదిరించినట్లు షమీమ్ స్పష్టంగా సీబీఐకి చెప్పింది. వివేకా తన వారసుడిగా షమీమ్‌కు కుమారుడు షెహన్షాను ప్రకటిస్తారనే అనుమానంతోనే… సునీతారెడ్డి దంపతులు వివేకా చెక్‌పవర్ తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వివేకా చనిపోవడానికి ముందు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చాలామంది వాంగ్మూలంలో చెప్పారు. వివేకా హత్య కేసులో సాక్ష్యులను బెదిరించేందుకు సునీతారెడ్డి దంపతులు తీవ్రంగా యత్నించారు. వివేకానందరెడ్డి వద్ద దశాబ్దాలుగా పనిచేస్తున్న పీఏ కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యం చెప్పని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతారెడ్డిలు తీవ్రంగా వేధించారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సునీతారెడ్డి పీఏ కృష్ణారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే తాను అబద్ధపు సాక్ష్యం చెప్పదిలేదని కృష్ణారెడ్డి తెగేసి చెప్పడంతో… నర్రెడ్డి సునీతారెడ్డి తన అసలు స్వరూపం బయటపెట్టారు. సీబీఐ అధికారులతో కలిసి కృష్ణారెడ్డిని తీవ్రంగా హింసించారు. తన తండ్రి వద్ద 30ఏళ్లపాటు పనిచేసిన వ్యక్తిపైనే సునీతారెడ్డి ఇంతటి దారుణాలకు పాల్పడ్డారు. లేఖను దాచిపెట్టమని చెప్పింది కూడా కృష్ణారెడ్డికే. ఎన్నిరకాలుగా హింసించినా కృష్ణారెడ్డి అబద్ధపు సాక్ష్యం చెప్పకపోవడంతో… ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పిఏ కృష్ణారెడ్డి కుమారులను పిలిపించి సీబీఐ అధికారి రాంసింగ్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఇక సునీతారెడ్డి దంపతులు నేరుగా రంగంలోకి దిగి కృష్ణారెడ్డి కుమారుడి వివాహం రద్దు చేయించారు. అంతే కాకుండా అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే మరోసారి అరెస్టు చేయిస్తామని కృష్ణారెడ్డిపై బెదిరింపులకు దిగారు. ఇక అసహనంతో కృష్ణారెడ్డి అబద్ధం చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సునీతారెడ్డి మాట జారింది. ఇంతే కాదు వివేకా హత్య కేసులో సునీతారెడ్డిపై అనుమానం రావడానికి మరో ప్రధాన కారణం… దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించకపోవడం. అప్రూవర్‌గా మారడానికి ముందే దస్తగిరి వేసిన బెయిల్ పిటిషన్‌ను సునీతారెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో వివేకాను తామే నరికామని… టీవీ చానెల్ల ముందు స్టేట్మెంట్లు ఇచ్చిన దస్తగిరికి వ్యతిరేకంగా సునీతారెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం… మరో అనుమానం. ఇప్పటికైనా దస్తగిరి బెయిల్ రద్దు చేయమని అడిగే అవకాశం ఉన్నా సునీతారెడ్డి… కనీసం మాట మాట్లాడటం లేదు. తండ్రిని హత్య చేసిన వ్యక్తి రోడ్డుపై తిరుగుతుంటే … సునీతారెడ్డి ఏమీ అనకపోవడం ఆమె ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. ఈ కేసులో రాజకీయ కోణాన్ని మాట్లాడుతున్న సునీతారెడ్డి అబద్ధాలను పదే పదే వల్లె వేస్తున్నారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన తండ్రి హత్య జరిగిందని చెబుతున్న సునీతారెడ్డి… తాను గతంలో మాట్లాడిన మాటలపై ఇప్పుడు నోరు మెదపడం లేదు. వివేకా హత్య జరగడానికి ముందే… కడప ఎంపీ సీటు ఖరారైందనే విషయం గతంలోనే సునీతారెడ్డి చెప్పారు. ఇప్పుడు మాత్రం వంశవృక్షాన్ని పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ రూపంలో వేస్తూ… అవినాష్‌రెడ్డి కుటుంబంపై చాలా కాలంగా తనలోపల ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి నిందితులకు శిక్షపడటం కన్నా… తన రాజకీయ ప్రత్యర్ధులపై బురదజల్లే ఆలోచనే సునీతారెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక తన తండ్రి హత్యకేసుతో పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్న సునీతారెడ్డికి… ఆమె సోదరి షర్మిల తోడయ్యారు. కేవలం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక ఎజెండాతో షర్మిల ఏకంగా అవినాష్‌రెడ్డే హంతకుడంటూ తేల్చేశారు. రాజకీయంగా కడపలో తనకు ప్రత్యర్ధి అయిన వ్యక్తి అవినాష్‌రెడ్డిపై షర్మిల చేసిన కామెంట్స్ వెనక ఉన్న ఉద్దేశం… అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఎందుకు చాలా కాలంగా షర్మిల అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేశారో… ఎన్నికల సమయం వచ్చాక మరింత స్పష్టంగా అర్ధమవుతోంది. -
‘మా ఊరి సిన్మా’వచ్చేస్తుంది
పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా శివరాం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా ఊరి సిన్మా’. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై మంజునాధ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ..‘మా ఊరి సిన్మా’ కొంతమంది చూపించాం. వారంతా బాగుందని అభినందిస్తూ ఉంటే ఆనందంగా ఉంది. మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను’ అన్నారు . చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ‘మా సినిమా కోసం మా టీమ్ చాలా కష్ట పడ్డారు. వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు. హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ ‘ మా సినిమాలో తండ్రి కొడుకుల అనురాగం ఉంది. బావ మరదళ్ల ఆప్యాయత ఉంది. అన్ని ఎమోషన్స్ మా చిత్రం లో ఉన్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను ’అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామ కృష్ణ (శ్రీధర్), ప్రముఖ నటులు నాగ మహేష్, బలగం సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ జిల్లా: వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లా పర్యటనలో.. బుధవారం పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులు అశ్వినిరెడ్డి, రామతేజేశ్వర్ రెడ్డిలను ఆశీర్వదించారు సీఎం జగన్. నూతన వధూవరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకకు హాజరైన వారికి అభివాదం చేసిన సీఎం జగన్.. అక్కడికి వచ్చిన వాళ్లను అక్కున చేర్చుకుని ఆప్యాయంగా పలకరించారు కూడా. -
పులివెందులతోనో, ఆంధ్రరాష్ట్రంతోనో కాదు, ప్రపంచంతో పోటీ పడాలి : సీఎం జగన్
-
అహోబిలాపురం స్కూల్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
చంద్రబాబు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయాడు : సీఎం వైఎస్ జగన్
-
తల్లితో సహజీవనం.. ఆమె కూతురుపై కన్నేసి..
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఓ బాలిక అత్యాచారానికి గురైంది. రైడ్స్ సంస్థ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన బాలిక పట్టణంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇటీవలే ఆ బాలిక తండ్రి చనిపోవడంతో ఆ బాలిక తల్లి నగరిగుట్టలోని మరొక వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉంది. వరుసకు తండ్రి లాంటి ఆ వ్యక్తి నరరూప రాక్షసుడుగా మారి ఆ బాలికపై కన్నేసి అత్యాచారం చేశాడు. భయంతో ఆ బాలిక రైడ్స్ చైల్డ్‌లైన్ 1098కు జరిగిన అత్యాచారం గురించి సమాచారం అందించింది. వెంటనే పులివెందుల పోలీసులు, చైల్డ్‌లైన్ 1098 విచారణ చేయగా ఆ వ్యక్తి ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే పులివెందుల పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత అతన్ని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ జోసఫ్ పాల్గొన్నారు. -
పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నాం: సీఎం జగన్
-
1200 పుస్తకాల్లో వైఎస్ చరిత్ర నిక్షిప్తం
ఆత్మకూరు రూరల్ వైఎస్ రాజశేఖరెడ్డి పేరులో ఉండే వైఎస్ అనే రెండు అక్షరాలు ఏమని సూచిస్తాయంటే చాలా మంది అది యెడుగూరి .. సందింటి .. అని చెప్ప గలుగుతారు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి ఆయన తండ్రి పుల్లారెడ్డిల ఇంటి పేరు యెడుగూరి మాత్రమే అని రామ్మోహన్ రెడ్డి చెప్పగలుగుతాడు. ఎందుకంటే పులివెందుల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన ఈయన వైఎస్ రాజశేఖరరెడ్డికి అభిమాని. వైఎస్ఆర్ జీవితంలో చదువు, వివాహం, రాజకీయ ప్రస్తానం.. పాదయాత్రలు ఒకటేమిటి సమస్త చరిత్రనంతా ఆయన 1200 పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. వివిధ పత్రికల్లో 1977 నుంచి అచ్చయిన వైఎస్ఆర్ కార్యక్రమాల క్లిప్పింగ్‌లన్నీ వరసగా చేర్చి అవసరమైన చోట నోట్స్ రాశారు. వైఎస్ఆర్ ఏడో వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్ఆర్ స్మతివనానికి వచ్చి రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను అనంతపురంలో నివసిస్తున్నానని చెప్పారు. స్మృతివనంలో వైఎస్ఆర్ జీవితంలోని ముఖ్యఘట్టాల చిత్రాలను, ఆయన చరిత్రను ప్రదర్శనగా ఉంచాలన్నారు. వైఎస్ రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి పులివెందుల మండలంలోని బలపనూరు గ్రామంలో ఒక సందులో చివర ఇంట్లో నివసించడం వల్లే ఇంటి పేరులో ‘సందింటి ’అని వచ్చి చేరిందని ఆయన చెప్పారు. వైఎస్సార్ జీవితంలో తారసపడ్డ చాలా మంది వ్యక్తులను..వారి వారసులను కలిసి వారి అభిప్రాయాలను కూడా రికార్డు చేసినట్లు చెప్పారు. -
పులివెందులలో జగన్ పర్యటన
-
పులివెందులలో వైఎస్ జగన్ విస్తృత పర్యటన
-
పులివెందులలో విస్తృతంగా భారతి ప్రచారం
-
నేడు పులివెందులలో జగన్ నామినేషన్