Crime: Case Registered Against The Accused In Incident Of Harassment | Rides‌ Childline - Sakshi
Sakshi News home page

Crime: తల్లితో సహజీవనం.. ఆమె కూతురుపై కన్నేసి..

Published Thu, Apr 28 2022 10:36 AM | Last Updated on Thu, Apr 28 2022 11:15 AM

Case Registered Against The Accused In Incident Of Harassment - Sakshi

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి రిజిస్టార్‌ ఆఫీస్‌ దగ్గర ఓ బాలిక అత్యాచారానికి గురైంది. రైడ్స్‌ సంస్థ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన బాలిక పట్టణంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇటీవలే ఆ బాలిక తండ్రి చనిపోవడంతో ఆ బాలిక తల్లి నగరిగుట్టలోని మరొక వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉంది. వరుసకు తండ్రి లాంటి ఆ వ్యక్తి నరరూప రాక్షసుడుగా మారి ఆ బాలికపై కన్నేసి అత్యాచారం చేశాడు.

భయంతో ఆ బాలిక రైడ్స్‌ చైల్డ్‌లైన్‌ 1098కు జరిగిన అత్యాచారం గురించి సమాచారం అందించింది. వెంటనే పులివెందుల పోలీసులు, చైల్డ్‌లైన్‌ 1098 విచారణ చేయగా ఆ వ్యక్తి ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే పులివెందుల పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. తర్వాత అతన్ని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ జోసఫ్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement