1200 పుస్తకాల్లో వైఎస్‌ చరిత్ర నిక్షిప్తం | ys history in 1200 books | Sakshi
Sakshi News home page

1200 పుస్తకాల్లో వైఎస్‌ చరిత్ర నిక్షిప్తం

Published Sat, Sep 3 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

1200 పుస్తకాల్లో వైఎస్‌ చరిత్ర నిక్షిప్తం

1200 పుస్తకాల్లో వైఎస్‌ చరిత్ర నిక్షిప్తం

ఆత్మకూరు రూరల్‌
వైఎస్‌ రాజశేఖరెడ్డి పేరులో ఉండే వైఎస్‌ అనే రెండు అక్షరాలు ఏమని సూచిస్తాయంటే చాలా మంది అది యెడుగూరి .. సందింటి .. అని చెప్ప గలుగుతారు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి  ఆయన తండ్రి పుల్లారెడ్డిల ఇంటి పేరు యెడుగూరి మాత్రమే అని రామ్మోహన్‌ రెడ్డి చెప్పగలుగుతాడు. ఎందుకంటే పులివెందుల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన ఈయన వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అభిమాని. వైఎస్‌ఆర్‌ జీవితంలో చదువు, వివాహం, రాజకీయ ప్రస్తానం.. పాదయాత్రలు ఒకటేమిటి సమస్త చరిత్రనంతా ఆయన 1200 పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు. వివిధ పత్రికల్లో 1977 నుంచి అచ్చయిన వైఎస్‌ఆర్‌ కార్యక్రమాల క్లిప్పింగ్‌లన్నీ వరసగా చేర్చి అవసరమైన చోట నోట్స్‌ రాశారు. వైఎస్‌ఆర్‌ ఏడో వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్‌ఆర్‌ స్మతివనానికి వచ్చి రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను అనంతపురంలో నివసిస్తున్నానని చెప్పారు. స్మృతివనంలో వైఎస్‌ఆర్‌ జీవితంలోని ముఖ్యఘట్టాల చిత్రాలను, ఆయన చరిత్రను ప్రదర్శనగా ఉంచాలన్నారు. వైఎస్‌ రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి పులివెందుల మండలంలోని బలపనూరు గ్రామంలో ఒక సందులో చివర ఇంట్లో నివసించడం వల్లే ఇంటి పేరులో ‘సందింటి ’అని వచ్చి చేరిందని ఆయన చెప్పారు. వైఎస్సార్‌ జీవితంలో తారసపడ్డ చాలా మంది వ్యక్తులను..వారి వారసులను కలిసి వారి అభిప్రాయాలను కూడా  రికార్డు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement