చూపుల్లో బుల్లెట్ కంటే పవరూ... యాటిట్యూడ్‌లో ఇతరులకు అంతు చిక్కని ఆలోచనలూ... ఈ రెండిటికీ మించి సూపర్ స్టైలూ... మహేశ్‌బాబు కొత్త లుక్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. మహేశ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘స్పైడర్’ను టైటిల్‌గా ఖరారు చేశారు. బుధవారం టైటిల్‌తో పాటు సినిమాలో మహేశ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. గన్ పట్టుకోవడం, ఇన్‌షర్ట్ చేసుకోవడం మహేశ్‌కు కొత్త కాదు. కానీ, మాస్‌లో క్లాస్... క్లాస్‌లో మాస్.... మిక్స్ చేసిన ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. మహేశ్ జేమ్స్ బాండ్‌లా ఉన్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. క్లైమాక్స్, రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. జూన్ 23న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు ఎస్.జె. సూర్య, తమిళ నటుడు భరత్ తదితరులు నటిసున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, సంగీతం: హ్యారీస్ జయరాజ్.
క్లాస్.. మాస్... స్పైడరే
Published Thu, Apr 13 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
Advertisement
Advertisement