
సాక్షి, హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న చిత్రం ‘రంగస్థలం 1985’.. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను తాజాగా రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసుకున్నాడు. షూటింగ్ స్పాట్‌లో రామ్‌చరణ్ ఓ చెక్క ముక్కను గట్టిగా ఉందా, లేదా అన్నది చెక్ చేసి..దానితో కమేడియన్ మహేశ్‌ను ఎలా కొట్టాలో చూపించాడు. ఆ తర్వాత ఆ చెక్కను మరో జబర్దస్త్ కమేడియన్ శ్రీనుకు అందించాడు.
ప్రాణం బిగపట్టుకొని నిలబడిన మహేశ్‌ను శ్రీను ఆ చెక్క బద్దలు అయ్యేలా కొట్టాడు. ఇదంతా ఎందుకంటే.. మహేశ్ చేసిన తప్పిదానికి. అతను గతరాత్రి చాలా రీటేక్‌లు తీసుకున్నాడట. ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పుడు ఇలా రీటేక్‌లు తీసుకుంటే షూటింగ్ స్పాట్‌లోని సిబ్బంది కాలాదా? అందుకే చిత్రయూనిట్ తరఫున ఇలా కొట్టి పనిష్మెంట్ ఇచ్చారు. మరీ ఇది నిజంగానే పనిష్మెంటా అంటే కాదు.. షూటింగ్ మధ్యలో సరదా కోసం ఇలా ఓ వీడియోను చిత్రీకరించి అభిమానులకు కానుకగా చెర్రీ షేర్ చేశాడు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ’గతరాత్రి జరిగిన షూటింగ్‌లో మహేశ్ ఎక్కువ రీటేక్‌లు తీసుకున్నాడు. అందుకే చిత్రయూనిట్ తరఫున అతను ఇది భరించాల్సి వచ్చింది’ అని చెర్రీ ఈ పోస్ట్‌కు కామెంట్ పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment