
డ్రాకులా పుట్టినచోట... మహేశ్, నేనూ!
...స్టెప్పులేస్తూ ఓ పాటేసుకున్నామని రకుల్‌ప్రీత్ సింగ్ చెబుతున్నారు.
...స్టెప్పులేస్తూ ఓ పాటేసుకున్నామని రకుల్‌ప్రీత్ సింగ్ చెబుతున్నారు. డ్రాకులా అంటే రక్తపిశాచి. నవలలు చదివేవారికి, హాలీవుడ్ హారర్ సిన్మా ప్రేమికులకు బాగా పరిచయమున్న పేరు. కొంతమంది అయితే ఈ పేరు వింటే ప్యాంటు తడిపేసుకుంటారంటే నమ్మండి. డ్రాకులా బేస్డ్ ఫిల్మ్స్ అంతలా భయపెట్టేశాయి మరి! అవ్వడానికి ఫాంటసీ అయినా.. డ్రాకులా పుట్టింది రొమేనియాలో! మహేశ్‌బాబు, రకుల్ జంటగా నటించిన ‘స్పైడర్’లో ఓ పాటను ఇటీవలే అక్కడ చిత్రీకరించారు. డ్రాకులా పుట్టిన కోట(రాజ భవనం) దగ్గరే రెండు రోజులు షూటింగ్ చేశారు. కానీ, రకుల్‌కి ఆ కోటలోకి వెళ్లే టైమ్–ఛాన్స్ దొరకలేదట.
అందువల్ల, ఇంకోసారి అక్కడికి వెళ్లాలనుకుంటున్నారు. ‘‘రొమేనియాలో ఎక్కడ చూసినా పురాతన కట్టడాలే. డ్రాకులా గురించి అక్కడ కథలు కథలుగా చెబుతుంటారు. రెస్టారెంట్స్‌లో డ్రాకులా పేరుతో స్పెషల్ ఫుడ్ వడ్డిస్తున్నారు. ఓ రెస్టారెంట్‌లో డ్రాకులా మీల్స్ బాగుంటుందనీ, తినమనీ అన్నారు. అదోలా ఉండడంతో తినలేదు. కానీ, రొమేనియా నాకు బాగా నచ్చింది. త్వరలో అక్కడికి వెళ్తా’’ అన్నారు రకుల్. దర్శకుడు మురుగదాస్ అక్కడ ఏ పాట తీశారో మరి! ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా ఈ నెల 27న విడుదల చేస్తున్నారు.