AP Global Investors Summit 2023: Visakha GIS Conference Mainly Focuses On 15 Key Sectors - Sakshi
Sakshi News home page

AP Global Investors Summit 2023: పెట్టుబడులకు రాచబాట

Published Tue, Feb 28 2023 2:21 AM | Last Updated on Tue, Feb 28 2023 2:53 PM

Visakha GIS Conference mainly focuses on 15 key Sectors - Sakshi

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు

రాష్ట్ర ప్రగతిని చూడండి 

విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరై రాష్ట్ర ప్రగతి, అందాలను ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నా. మీ అందర్నీ త్వరలో విశాఖ సదస్సులో కలుస్తా. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌   

సాక్షి, అమరావతి: సహజ వనరులకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలను సద్విని­యోగం చేసుకుంటూ కీలకమైన 15 రంగాల్లో పెట్టు­బ­డులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలిరోజైన మార్చి 3వ తేదీన తొమ్మిది రంగాలపై, రెండో రోజు 6 రంగాలపై చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఫుడ్‌ ప్రాసె­సింగ్, రెన్యువబుల్‌ ఎనర్జీ–గ్రీన్‌ హైడ్రోజన్, హెల్త్‌­కేర్‌–­మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఏరోస్పేస్‌–డిఫెన్స్, పెట్రోలియం–ప్రెటో కెమికల్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రా–లాజిస్టిక్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్‌–ఈవీ, స్టార్టప్స్‌–­ఇన్నోవే­షన్స్, ఉన్నత విద్య, టూరిజం, టెక్స్‌టైల్, ఫార్మా స్యూటికల్స్‌ రంగాలను ఎంపిక చేసింది.

రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఒనగూరే లాభాలను వివరిస్తూ ఇప్పటికే పెట్టుబ­డులు పెట్టిన సంస్థల అభిప్రాయాలతో వీడియో విజువల్స్‌ సిద్ధం చేయడమే కాకుండా ప్రత్యేక సెషన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జా­తీయంగా చోటు చేసుకుంటున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని  అందిపుచ్చుకోవడం లాంటి అంశాలపై పారిశ్రామికవేత్తలు, నిపుణులు పాల్గొనేలా మొత్తం 15 సెమినార్లను నిర్వహించనుంది. ఇందుకోసం ప్రధాన సమావేశ మందిరానికి అదనంగా మరో మూడు సెమినార్‌ హాల్స్‌ను సిద్ధం చేశారు. 

విశాఖకు కార్పొరేట్‌ దిగ్గజాలు
వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్న జీఐఎస్‌ 2023లో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెదిన కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు విశాఖకు తరలి వస్తున్నాయి. రిలయన్స్‌ గ్రూపునకు చెందిన ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూపు గౌతమ్‌ అదాని, అర్సల్‌ మిట్టల్‌ గ్రూపు సీఈవో ఆదిత్య మిట్టల్, ఆదిత్య బిర్లా గూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా, టెస్లా కోఫౌండర్‌ మార్టిన్‌ ఎంబరహర్డ్‌ లాంటి 22 మందికిపైగా కార్పొరేట్‌ ప్రముఖులు ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. మార్చి 3వతేదీన తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 వరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జీఐఎస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.

కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌రెడ్డి, ఆర్కే సింగ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన కేంద్ర కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సెమినార్లు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సెమినార్లు జరుగుతున్న సమయంలోనే ప్రధాన సమావేశ మందిరంలో ఆహార వ్యవస్థలో మారుతున్న పరిణామ క్రమాలపై ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం అతిథుల కోసం  సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది. 

సీఎం సమక్షంలో ఒప్పందాలు..
సమ్మిట్‌ రెండో రోజు మార్చి 4న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 వరకు సెమినార్లు జరుగుతాయి. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో పెట్టుబడుల ఒప్పందాల అనంతరం ముగింపు సమావేశం జరగనుంది. ముగింపు సమావేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి, వెల్‌ప్సన్‌ గ్రూపు ఎండీ రాజేష్‌ మండవేవాలా, దివీస్‌ ల్యాబ్‌ సీవోవో కిరణ్‌ దివీ, లారస్‌ ల్యాబ్‌ ఫౌండర్‌ సీఈవో చావా సత్యనారాయణతోపాటు మొత్తం 10 మంది కార్పొరేట్‌ ప్రముఖులు పాల్గొంటారు. కేంద్ర మంత్రులు సర్బానంద్‌ సోనావాలా, రాజీవ్‌ చంద్రశేఖరన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. ముగింపు సమావేశానికి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. 

రంగాల వారీగా సెమినార్లు, వక్తల వివరాలు
మార్చి 3వతేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.50 వరకు
అంశం: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
మోడరేటర్‌: సౌరభ్‌గౌర్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి
వక్తలు: డాక్టర్‌ సత్యనారాయణ డైరెక్టర్‌ ఐఐటీ తిరుపతి, రవి తంగిరాల మాస్‌ మ్యూచువల్‌ హెడ్, ఫ్రొఫెసర్‌ కోన్‌ ముజాకిస్‌ డైకిన్‌ యూనివర్సిటీ కోఫౌండర్, శ్రీధర్‌ కోసరాజు ఐటాప్‌ ప్రెసిడెంట్, లక్స్‌రావు చేపూరి సీఈవో టెక్నోజెన్, విజయ్‌ భాస్కర్‌ రెడ్డి టెక్‌బుల్‌ డైరెక్టర్‌

అంశం: ఆటోమొబైల్‌– ఎలక్ట్రిక్‌ వాహనాలు
మోడరేటర్‌: పీస్‌ ప్రద్యుమ్న, రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి
వక్తలు: మాట్రిన్‌ ఎంబర్‌హార్డ్‌ టెస్లా కోఫౌండర్, కేవీ ప్రదీప్‌ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీ, రాజేష్‌ మిట్టల్‌ ఇసుజు ఇండియా ప్రెసిడెంట్, కబ్‌దాంగ్‌లీ కియా ఇండియా చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్, శశాంక్‌ శ్రీవాత్సవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, కమల్‌ బాలి వోల్వో గ్రూపు ప్రెసిడెంట్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌.

అంశం: రెన్యువబుల్‌ ఎనర్జీ
మోడరేటర్‌: రమణారెడ్డి, నెడ్‌క్యాప్‌ ఎండీ
వక్తలు: గురుదీప్‌సింగ్‌ ఎన్‌టీపీసీ సీఎండీ, అనిల్‌ చలమలశెట్టి గ్రీన్‌కో సీఈవో, నవాల్‌ సైని బ్రూక్‌ఫీల్డ్‌ ఎండీ, సుబ్రమణ్యం పులిపాక నేషనల్‌ సోలార్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో, డేవిడ్‌ ఏ కొల్లార్డ్‌ స్కేల్‌ ఫెసిలిటేషన్‌ మేనేజింగ్‌ పార్టనర్‌–సీఈవో, విపుల్‌ తులి సెంబ్‌కార్ప్‌ సౌత్‌ ఏషియా సీఈవో, విశ్వేశర రెడ్డి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ ఎండీ.

సాయంత్రం 4 నుంచి 4.50 వరకు
అంశం: ఇండస్ట్రియల్‌ లాజిస్టిక్‌ – ఇన్‌ఫ్రా
మోడరేటర్‌: రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో ఏపీ మారిటైమ్‌ బోర్డు
వక్తలు: సుమిత్‌ దావ్రా డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి(లాజిస్టిక్స్‌), జీబీఎస్‌ రాజు చైర్మన్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, రవి సన్నారెడ్డి చైర్మన్‌ శ్రీసిటీ, రవికాంత్‌ యమర్తి లాజిస్టిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్, సుకుమార్‌ కామేశ్వరన్‌ సీవోవో టీవీఎస్‌ సప్లైచైన్‌ సొల్యూషన్స్, అనయ్‌ శుక్లా సీసీవో వెల్సపన్‌ వన్‌ లాజిస్టిక్స్‌.

► అంశం: స్టార్టప్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌
మోడరేటర్‌: సౌరభ్‌ గౌర్, కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ
వక్తలు: బీవీ నాయుడు, కర్నాటక డిజిటల్‌ ఎకానమీ మిషన్‌ చైర్మన్, విజయ్‌ శేఖర్‌ శర్మ, పేటీఎం ఫౌండర్‌ చైర్మన్, శ్వేత రాజ్‌పాల్‌ కొహ్లి సీక్వోయా క్యాపిటల్‌ చీఫ్‌ పబ్లిక్‌ పాలసీ ఆఫీసర్, పడాల భూదేవి సవర వుమెన్‌ సామాజిక కార్యకర్త, రాజా శ్రీనివాస్‌ ఆర్‌ఎన్‌ఐటీ సొల్యూషన్స్‌ ఫౌండర్‌ సీఈవో, అంకిత్‌ అగర్వాల్‌ ఫూల్‌ కంపెనీ ఫౌండర్‌ సీఈవో, హర్షిల్‌ మాథూర్‌ రజోర్‌పే సీఈవో–కోఫౌండర్‌.

అంశం: హెల్త్‌కేర్‌ అండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌
మోడరేటర్‌ : టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి, వైద్యశాఖ
వక్తలు: దిలీప్‌ జోష్‌ మణిపాల్‌ హాస్పిటల్‌ గ్రూపుసీఈవో, డాక్టర్‌ గురునాథ్‌ రెడ్డి కాంటినెంటల్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ, డాక్టర్‌ ముఖేష్‌ తిప్రాఠి ఎయిమ్స్‌ మంగళగిరి డైరెక్టర్, విభవ్‌ గార్గ్‌ బోస్టన్‌ సైంటిఫిక్‌ డైరెక్టర్, ఆనంద్‌ కే  ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నస్టిక్స్‌ సీఈవో, డాక్టర్‌ జితేంద్ర శర్మ ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ సీఈవో

సాయంత్రం 5 నుంచి 5.50 వరకు
అంశం: ఎలక్ట్రానిక్స్‌
మోడరేటర్‌ : సౌరభ్‌ గౌర్, కార్యదర్శి ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్‌ శాఖ
వక్తలు: జోష్‌ ఫల్గర్‌ భారత్‌ ఎఫ్‌ఐహెచ్‌ కంట్రీ హెడ్‌– ఎండీ, శశికుమార్‌ జి సాల్‌కామ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఇండియా ఎండీ, దాసరి రామకృష్ణ ఎఫ్‌ట్రానిక్స్‌ ఎండీ, ప్రోఫెసర్‌ జాక్‌ సింగ్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ సారస్వక్, దేవిదాస్‌ కస్‌బేకర్‌ బ్లూస్టార్‌ క్లైమెటిక్‌ సీఈవో.

అంశం: అగ్రి అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌
మోడరేటర్‌: చిరంజీవి చౌదరి కార్యదర్శి ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌
వక్తలు:  మనోజ్‌ అహుజా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, సతోషి ససకి ఐఎల్‌వో సౌత్‌ ఏషియా డిప్యూటీ డైరక్టర్, జే రాజన్‌ అముల్‌ సౌత్‌ ఇండియా జోనల్‌హెడ్, పి.వెంకటరావు బ్లూస్టార్‌ ప్రెసిడెంట్‌ సీవోవో, హెన్రిక్‌ స్టమ్‌ క్రిస్టెన్సన్‌ బ్లెండ్‌ హబ్‌ కార్ప్‌ ఫౌండర్, బలరామ్‌ సింగ్‌ యాదవ్‌ గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఎండీ.
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ కోసం విశాఖలోని ఏయూ మైదానంలో వేదికను నిర్మిస్తున్న దృశ్యం     

మార్చి 4వతేదీ..
ఉదయం 10.30 నుంచి 11.20 వరకు
అంశం: పెట్రో అండ్‌ పెట్రో కెమికల్స్‌
మోడరేటర్‌ : ప్రకాష్‌ గౌర్‌ సీఈవో ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్‌
వక్తలు: అరుణ్‌ బరోకా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, జనార్థన్‌ రామానుజులు ఎస్‌ఏబీఐసీ వైస్‌ ప్రెసిడెంట్, ఏవీ సహనే ఐవోసీఎల్‌ ఈడీ, డీవీఎస్‌ నారాయణ రాజు డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌

అంశం: ఉన్నత విద్య
మోడరేటర్‌: హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీఎస్‌సీహెచ్‌ఈ.
వక్తలు : ఫ్రొఫెసర్‌ యూబీ దేశాయ్‌ ఐఐటీ హైదరాబాద్‌ ఫౌండింగ్‌ డైరెక్టర్, డాక్టర్‌ జీ విశ్వనాథన్‌ విట్‌ యూనివర్సిటీ చాన్సలర్, పద్మశ్రీ ఎన్‌ బాలకృష్ణన్‌ ఐఐఎస్‌సీ బెంగళూరు ఎయిరోడైనమిక్స్‌ ప్రొఫెసర్, డాక్టర్‌ బుద్ధా చంద్రశేఖర్‌ సీవోవో ఏఐసీటీఈ, ఎం చంద్ర శేఖర్‌ ఐఐఎం విశాఖ డైరెక్టర్, ప్రొఫెసర్‌ జంధ్యాల బిజీ తిలక్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌

అంశం: టెక్స్‌టైల్‌ అండ్‌ అప్పరెల్‌
మోడరేటర్‌ : ఆర్‌సీఎం రెడ్డి ఎండీ సీఈవో స్కూల్‌నెట్‌ ఇండియా
వక్తలు: యూపి సింగ్‌ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాజేష్‌ మండవేవాలా వెల్సపన్‌ గ్రూపు ఎండీ, నారెన్‌ గోయంకా టెక్స్‌పోర్ట్‌ ఇండస్ట్రీస్, సుచిరా సురేంద్రనాథ్‌ బ్రాండిక్స్‌ డైరెక్టర్, ప్రశాంత్‌ అగర్వాల్‌ వైజర్‌ అడ్వైజర్స్‌ కో–ఫౌండర్, సచిన్‌ మాలిక్‌ ఏషియా ఫసిఫిక్‌ రేయాన్‌ గ్లోబల్‌ సేల్స్‌ హెడ్‌.

ఉదయం 11.30 నుంచి 12.20 వరకు
అంశం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌
మోడరేటర్‌: సౌరభ్‌గౌర్, కార్యదర్శి ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌
వక్తలు : రాజీవ్‌ చంద్రశేఖరన్‌ కేంద్ర సహాయమంత్రి, అతుల్‌ తివారీ కేంద్రకార్యదర్శి ఎంఎస్‌డీఈ, అనితా రాజన్‌ టాటా స్ట్రైవ్‌ సీఈవో, సంజయ్‌ విశ్వనాథన్‌ ఈడీ4ఆల్‌  కోఫౌండర్, సునిల్‌ దహియా వాద్వాని ఫౌండేషన్‌ ఈవీపీ, సంజయ్‌ అవస్థి యునెస్కో హెడ్, కీర్తి సేత్‌ నాస్కాం ఫ్యూచర్‌ స్కిల్‌ సీఈవో

అంశం: పర్యాటకం
మోడరేటర్‌: రజిత్‌ భార్గవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ
వక్తలు : సుభాష్‌ గోయల్‌ ఎస్‌టీఐసీ ట్రావెల్స్‌ చైర్మన్, సంజయ్‌ సేథి చాలెట్‌ గ్రూపు సీఈవో ఎండీ, అనిల్‌ చద్ధా ఐటీసీ హోటల్స్‌ సీఈవో, దినేష్‌ చద్దా తాజ్‌గ్రూపు సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్, సంజయ్‌ రాజ్‌ ఎండీ,సరోవర్‌ గ్రూపు, పూజా రే మైఫేర్‌ ఎండీ, ఆర్‌ శ్రీనివాస్‌ ఎక్స్‌ డెలాయిట్‌ గ్లోబల్‌ హెడ్‌(టూరిజం)

అంశం: ఫార్మా లైఫ్‌ సైన్సెస్‌
మోడరేటర్‌: జే.నివాస్, కమిషనర్‌ వైద్య ఆరోగ్య శాఖ
వక్తలు: సతీష్‌రెడ్డి డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్, సత్యనారాయణ చావా లారస్‌ ల్యాబ్‌ ఫౌండర్‌ సీఈవో, ఎంఎన్‌రావు మైలాన్‌ ల్యాబ్‌ కంట్రీ హెడ్, విక్రం శుక్లా ఫైజర్‌ వైస్‌ ప్రెసిడెంట్, అజుమా ఫుజిమురా ఈసాయి ఫార్మాస్యూటికల్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ హెడ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement