
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలైన నేపథ్యంలో హాస్టళ్లను కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున బైఠాయించిన విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment