
సాక్షి, విశాఖపట్నం: ఏయూ పరిధిలో ఆగస్టు 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి రెండో సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లో ఫలితాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు నిర్వహించనున్నట్లు వీసీ ప్రసాదరెడ్డి తెలిపారు.
గౌరవ ఆచార్యుల నియామకం
ఏయూలో పదవీ విరమణ చేసిన నలుగురు ప్రొఫెసర్‌లను గౌరవ ఆచార్యులుగా నియమిస్తూ ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కామర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్రొ.సత్యనారాయణ, ప్రొ.మధుసూదనరావు, ప్రొ.సుదర్శనరావు.. మేథమేటిక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్రొ.కేకేఎం శర్మ హానరీ ప్రొఫెసర్లుగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment