
సాక్షి, ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) దరఖాస్తుకు ఈ నెల 11వ తేదీతో గడువు ముగియనుందని ఏపీ సెట్ మెంబర్ సెక్రెటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 19వ తేదీ వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో ఈ నెల 26వ తేదీ వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఆక్టోబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 20వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, కడప ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.
జనరల్ అభ్యర్థులు రూ.1,200, బీసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.700 పరీక్ష ఫీజుగా చెల్లించాలన్నారు. మెత్తం 30 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం https://www.andhrauniversity.edu.in, https://apset.net.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment