ఔషధాల రక్షణ కీలకం | Brooke Heggins says Drug manufacturing industry in India is amazing | Sakshi
Sakshi News home page

ఔషధాల రక్షణ కీలకం

Published Sat, Feb 25 2023 3:47 AM | Last Updated on Sat, Feb 25 2023 3:47 AM

Brooke Heggins says Drug manufacturing industry in India is amazing - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఫార్మా పరిశ్రమలు కేవలం ఔషద ఉత్పత్తులపైనే కాకుండా... వాటి రక్షణ, నిల్వలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌ బ్రూకీ హెగిన్స్‌ చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏయూ ఫార్మశీ కళాశాల, యూఎస్‌ ఎఫ్‌డీఏ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్‌షాప్‌ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బ్రూకీ హెగిన్స్‌... ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫార్మా రంగానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే....

నిరంతర పరిశీలన 
► ఆహార ఉత్పత్తులే కాదు, ఔషధాల తయారీ, నిల్వ­ల విషయంలో సరైన పద్ధతుల్లో నాణ్యత, భ­ద్రత ప్రమాణాలను పరిశీలిస్తు­న్నాం.  

► మందులు, వైద్య పరికరాల పరిరక్షణ­కు ఎఫ్‌డీఏ గైడ్‌లైన్స్‌ పాటించాల్సిందే.  

► ఫార్మా పరిశ్రమలు క్లీన్‌ రూమ్‌ ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా స్టెరైల్‌గా భావించే ఔషధాలను ఉత్పత్తి చేసిన అనంతరం సూక్ష్మజీవుల బారినపడకుండా భద్రపరచాలి. లేదంటే వాటిని వినియోగించేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

►అసెప్టిక్‌ ప్రాసెసింగ్‌ (సూక్ష్మ కణాలు చేరకుండా భద్రపరచడం) అనేది ఫార్మా ఉత్పత్తుల కార్య­కలా­పాల్లో అత్యంత ముఖ్యమైనది. ప్రమాదకరమైనది కూడా.  

► సాధారణంగా ఒక మనిషి శరీరం నుంచి రోజూ లక్షలాది బ్యాక్టీరియాలు విడుదలవుతుంటాయి. వీటి ద్వారా మందులు తయా­రుచేసే సమయంలోనే కొన్నిసార్లు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్‌ తయారీలో గ్లోవ్‌ లెస్‌ రోబోటి­క్స్‌ అసలైన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు.  

► డ్రగ్స్‌ తయారీ, భద్రత విషయంలో భారత్‌లోని ఫార్మా పరిశ్రమలు అద్భుతంగా వ్యవహరిస్తున్నాయి.  

► జనరిక్‌ ఔషధాల తయారీ, సరఫరాలో భారత్‌ నంబర్‌ వన్‌గా ఉంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద డ్రగ్‌ పరిశ్రమగా, విలువ ప్రకారం పదో స్థానంలో భారత్‌ ఉంది. ఫార్మారంగంలో అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement