
సాక్షి, అమరావతి : విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర సంస్థ సీఈవో సీపీ గుర్నానీ, గ్రంథి మల్లిఖార్జునరావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, శిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీఎంఆర్ అధినేత, అలుమ్ని వ్యవస్థాపక చైర్మన్ జీఎం రావు, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, మాజీ డీజీపీ, గంగవరం పోర్ట్ సీఈవో సాంబశివరావు, మాజీ వీసీ ప్రొఫెసర్ బీల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment