Rare feat
-
GT VS KKR: అరుదైన మైలురాయిని అధిగమించిన శుభ్‌మన్ గిల్
అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. సునీల్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా గిల్ ఐపీఎల్లో 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో గిల్ మరో రికార్డు కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లో ఈ రేర్ ఫీట్‌ను సాధించిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ 23 సంవత్సరాల 27 రోజుల్లో 2000 పరుగులు పూర్తి చేయగా.. గిల్ 23 ఏళ్ల 214 రోజుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. వీరి తర్వాత సంజూ శాంసన్ (24 ఏళ్ల 140 రోజుల), విరాట్ కోహ్లి (24 ఏళ్ల 175 రోజులు), సురేశ్ రైనా (25 ఏళ్ల 155 రోజులు) అతి పిన్న వయసులో 2000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాళ్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్ మాంచి జోరుమీదున్న గిల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 115/2గా ఉంది. సాయి సుదర్శన్ (32), అభినవ్ మనోహర్ (14) క్రీజ్‌లో ఉన్నారు. -
ఆంధ్రా యూనివర్సిటీ మరో అరుదైన ఘనత
ఏయూక్యాంపస్(విశాఖపట్నం): ఆంధ్ర యూనివర్సిటీ మరో అరుదైన ఘనతను సాధించింది. యూనివర్సిటీ పరిధిలో చేసిన పరిశోధనల థీసిస్‌లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో అద్భుత ప్రగతిని కనబరిచింది. శోధ్‌గంగ వెబ్సైట్లో కేవలం తొమ్మిది నెలల్లోనే 7,635 థీసిస్‌లను అప్లోడ్ చేసి 179వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది. ఏయూలో 1942 నుంచి చేసిన పరిశోధనలకు సంబంధించిన గ్రంథాలను కూడా శోధ్‌గంగలో పొందుపరించింది. తద్వారా విలువైన పరిశోధన పత్రాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో మరికొన్ని థీసిస్‌లు అప్లోడ్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: 5న అల్పపీడనం.. ఏపీలో వర్షాలు ఇదీ శోధ్‌గంగ లక్ష్యం... దేశవ్యాప్తంగా పరిశోధన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి, భవిష్యత్ తరాల పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఇన్‌ఫ్లిబినెట్ సంస్థ శో««ద్గంగ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దేశంలోని 584 విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని పరిశోధన గ్రంథాలను ఎప్పటికప్పుడు దీనిలో పొందుపరుస్తున్నాయి. ఈ వెబ్సైట్లో ఇప్పటివరకు 3,98,264 థీసిస్‌లు అప్లోడ్ చేశాయి. పరిశోధకులు కోర్సుల వారీగా తమకు అవసరమైన థీసిస్‌లను ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటిని చదువుకోవడంతోపాటు రెఫరెన్స్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. 179 నుంచి 9వ స్థానానికి... శోధ్‌గంగలో థీసిస్‌ల అప్‌లోడ్‌కు సంబంధించి ఏయూ మార్చి నెలలో 179వ స్థానంలో ఉంది. శోధ్‌గంగ ప్రాధాన్యతను గుర్తించిన ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి గ్రంథాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో యూనివర్సిటీలో దశాబ్దాలుగా ఉన్న 7,635 థీసిస్‌లను ఇప్పటివరకు శో«ధ్గంగలో అప్లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఏయూ నుంచి అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ కోర్సులకు చెందిన 3,388, సైన్స్ కోర్సులకు చెందిన 2,316, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన 1,270, ఫార్మసీ కోర్సులకు చెందిన 487, న్యాయవిద్యకు చెందిన 174 థీసిస్‌లు అప్లోడ్ చేశారు. గతంలో పరిశోధన గ్రంథాలను చేతితో రాసి, టైప్ చేసి సమరి్పంచేవారు. వీటితోపాటు దశాబ్దాల కిందట చేసిన పరిశోధనల పుస్తకాలను కూడా స్కానింగ్ చేసి అప్లోడ్ చేశారు. తొలి ఐదు స్థానాల్లో నిలవడమే లక్ష్యం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని శోధ్‌గంగలో తొలి ఐదు స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. యూనివర్సిటీలో జరిగే పరిశోధనల గ్రంథాలను శో««ద్గంగలో ఉంచడం వల్ల దేశవ్యాప్తంగా పరిశోధకులకు అందుబాటులో ఉంటాయి. నూతన పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా, మార్గదర్శకంగా నిలుస్తాయి. త్వరలో మరిన్ని థీసిస్‌లు స్కానింగ్ ప్రక్రియ పూర్తిచేసి అప్లోడ్ చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయి. – ఆచార్య పి.వెంకటేశ్వర్లు, చీఫ్ లైబ్రేరియన్, డాక్టర్ వీఎస్ కృష్ణా గ్రంథాలయం, ఏయూ -
‘ఉపాధి’లో జాతీయ రికార్డు
లక్ష కుటుంబాలకు వంద రోజుల పనిఅరుదైన ఘనత సాధించిన విశాఖ పనులు తక్కువ.. పనిదినాలెక్కువ5.62 లక్షల మందికూలీలకు పనులు రికార్డు స్థాయిలో 2.96 లక్షల పనిదినాలు విశాఖపట్నం:జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో విశాఖ జిల్లా అరుదైన ఫీట్ సాధించింది. అత్యధిక కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించిన జిల్లాగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎక్కువమంది కూలీలకు పనులు కల్పించడమే కాదు.. అత్యధిక పనిదినాలు కల్పించిన జిల్లాగా కూడా విశాఖ ఖ్యాతినార్జించింది. జిల్లాలో 4,70,162 కుటుంబాలకు జాబ్ కార్డులుండగా..38,550 శ్రమశక్తి సంఘాలున్నాయి. వాటి పరిధిలో 7,17,597 మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పనుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ పనిదినాలు కల్పించడంలో మాత్రం కొత్త రికార్డులు నెలకొల్పగలిగారు. కాగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.157 కోట్లకు రూ.57 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ఏడాది రూ.298 కోట్లకు రూ.159 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగారు. గతేడాది వంద కోట్లు మురిగి పోగా.. ఈఏడాది రూ.141 కోట్లు మురిగిపోయినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. అయిన ప్పటికీ పనులు కల్పించడంలో మాత్రం ఆలిండియా రికార్డును సాధించారు. ప్రస్తుతం 50 వేలకు పైగా పనులు జరుగుతుండగా.. రోజుకు 1.80 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. గతేడాది పనితీరు.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 3.03 లక్షల కుటుంబాలకు చెందిన 5.44 లక్షల మంది కూలీలకు పనులు, లక్షా 95 వేల పనిదినాలు కల్పించారు. వేతనాల రూపంలో వీరికి రూ.236 కోట్లు చెల్లించారు. గతేడాది ప్రతి కుటుంబానికి గరిష్టంగా 64 రోజుల పనికల్పించగా.. ఒక్కో కూలీ రూ.121కు తక్కువ కాకుండా సరాసరి వేతనం పొందగలిగారు. ఈ ఏడాది అన్నీ రికార్డులే.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 3.13 లక్షల కుటుంబాలకు చెందిన 5,62,315 మంది కూలీలకు ఏకంగా 2.26 లక్షల పనిదినాలు కల్పించి వేతనాల రూపంలో రూ.299 కోట్లను పొందేలా చేశారు. ఈ ఏడాది ప్రతి కుటుంబానికి సరాసరిన 72 రోజులు పని కల్పించగా, ఒక్కో కూలీ సరాసరిన రూ.132.13 చొప్పున వేతనం పొందగలిగారు. లక్షా 575 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించిన ఏకైక జిల్లాగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉపాధి హామీ సిబ్బందికి అభినందనలు అత్యధిక కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించిన ఏకైక జిల్లాగా విశాఖ రికార్డు పుటల్లోకి ఎక్కడం ఆనందంగా ఉంది. ఇందుకోసం ఈ ఏడాది ఉపాధి హామీ సిబ్బంది కృషి అభినందనీయం. ముఖ్యంగా పనుల గుర్తింపు.. ప్రణాళికాబద్ధంగా పనులు కల్పించడంలో పీడీ శ్రీరాములు నాయుడు కృషి ప్రశంసనీయం. -డాక్టర్ ఎన్.యువరాజ్, కలెక్టర్ చాలా ఆనందంగా ఉంది వంద రోజుల పనిదినాలు కల్పించడంలో జిల్లా రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్‌తో సహా ఉపాధి హామీలో పనిచేసే సిబ్బంది సమష్టి కృషి ఇది. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా పనిచేస్తాం. -శ్రీరాములు నాయుడు, పీడీ, డ్వామా