pic credit: IPL Twitter
అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 9) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. సునీల్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో బౌండరీ కొట్టడం ద్వారా గిల్ ఐపీఎల్‌లో 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో గిల్ మరో రికార్డు కూడా నమోదు చేశాడు.
ఐపీఎల్‌లో ఈ రేర్ ఫీట్‌ను సాధించిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ 23 సంవత్సరాల 27 రోజుల్లో 2000 పరుగులు పూర్తి చేయగా.. గిల్ 23 ఏళ్ల 214 రోజుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. వీరి తర్వాత సంజూ శాంసన్ (24 ఏళ్ల 140 రోజుల), విరాట్ కోహ్లి (24 ఏళ్ల 175 రోజులు), సురేశ్ రైనా (25 ఏళ్ల 155 రోజులు) అతి పిన్న వయసులో 2000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాళ్లుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్ మాంచి జోరుమీదున్న గిల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 115/2గా ఉంది. సాయి సుదర్శన్ (32), అభినవ్ మనోహర్ (14) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment