IPL 2023 Prize Money: Shubman Gill Wins 4 Awards Get Rs 40 Lakh - Sakshi
Sakshi News home page

IPL 2023: అదరగొట్టిన గిల్‌.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే? మొత్తం ప్రైజ్‌మనీ ఎంతంటే?

Published Tue, May 30 2023 3:51 PM | Last Updated on Tue, May 30 2023 4:44 PM

Shubman Gill Wins 4 Awards Get Rs 40 Lakh - Sakshi

ఐపీఎల్‌-2023లో గుజరాత్ టైటాన్స్‌ తుది మెట్టు మీద బోల్తా పడింది. అహ్మదాబాద్‌ వేదికగా చెన్నైసూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది రన్నరప్‌గా హార్దిక్‌ సేన నిలిచింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో గుజరాత్‌ స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

17 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 890 పరుగులతో ఈ ఏడాది సీజన్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కాగా టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన గిల్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏఏ అవార్డులు గెలుచుకున్నాడో ఓసారి పరిశీలిద్దాం.

గిల్‌ సొంతం చేసుకున్న అవార్డులు ఇవే..
ఈ ఏడాది సీజన్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో గిల్‌ అగ్ర స్థానంలో ఉండడంతో ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్నాడు. దీంతో గిల్‌ ప్రైజ్‌మనీ రూ. 10లక్షలు సొంతంచేసుకున్నాడు.

అదే విధంగా గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ది సీజన్‌ అవార్డు కూడా గిల్‌కే దక్కింది. ఈ అవార్డు రూపంలో గిల్‌కు రూ. 10 లక్షలు లభించింది.

ఈ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా కూడా గిల్‌ ఎంపికయ్యాడు.  అవార్డు రూపంలో గిల్‌ రూ.10 లక్షలు ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు.

ఈ ఏడాది సీజన్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. దీంతో అతడికి  ప్రైజ్‌మనీ రూపంలో రూ.10 లక్షలు దక్కించుకున్నాడు. ఓవరల్‌గా అవార్డుల రూపంలో గిల్‌ రూ. 40 లక్షలు సొంతంచేసుకున్నాడు.
చదవండి: ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement