సమైక్యాంధ్ర సాధించే వరకూ పోరు
Published Mon, Aug 12 2013 4:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర సాధించే వరకూ పోరు కొనసాగుతుందని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గొడారిగుంటలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సమైక్యాంధ్ర పోస్టర్‌ను ద్వారంపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను మరింత భాగస్వామ్యులను చేసేందుకు విస్తృత ప్రచారం చేయనున్నామన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీకి పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, వైఎస్సార్ సీపీ సిటీ యూత్ కన్వీనర్ కిషోర్, నాయకులు విళ్ల సత్యనారాయణ, ఐ.శ్రీను, సంగిశెట్టి అశోక్, కోనాడ ప్రకాష్, రెహ్మాన్‌ఖాన్, కుసుమకుమారి, చిల్ల లక్ష్మి, శివకుమారి, కుండల సాయికుమార్, జార్జ్, బషీర్, అల్లి రాజబాబు, కట్టా రమణ, మెర్ల చౌదరి, గాంధీ, చాట్ల చైతన్య, పమ్మి అప్పారావు తదితరులు
పాల్గొన్నారు.
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట ్ల నిరసన ప్రదర్శన
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదివారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి రామారావుపేట, టూటౌన్ మీదుగా భానుగుడి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
తెలుగుతల్లి విగ్రహ
పాదాలను పాలతో కడిగి పూలమాలలు వేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ జేఏసీ సీమాంధ్ర కన్వీనర్ బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ముందుకు వెళ్లేందుకు జిల్లా జేఏసీకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను స్తంభింపజేస్తామన్నారు. సంఘ నాయకులు కొండలరావు, రాజబాబు, వీరన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement