రేపటి నుంచి సమైక్య పోరు | ysr congress party samaikyandhra Fighting in Kakinada | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సమైక్య పోరు

Published Thu, Jan 2 2014 3:26 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ysr congress party samaikyandhra Fighting in Kakinada

సాక్షి ప్రతినిధి, కాకినాడ : సమైక్యాంధ్ర సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేపడుతున్న నిర్విరామ ఆందోళనల్లో భాగంగా ఈ నెల 3 నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి    ఈ మేరకు ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్టీ శ్రేణులన్నీ సమైక్య ఆందోళనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తబంద్‌లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా ఆ రోజు చేపట్టే బంద్‌ను విజయవంతం చేసేందుకు వ్యాపార, వాణిజ్య, విద్యార్థి తదితర అన్ని వర్గాల ప్రజలూ ముందుకు రావాలని కోరారు. నాలుగో తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బైక్‌ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఈ నెల 6 నుంచి 10 వరకు ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో మానవహారాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్‌లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకులు మొదలు కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొనాలని చిట్టబ్బాయి పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement