పెద్దింటివాడికైనా, పేదింటివాడికైనా మానసిక ఒత్తిడి ప్రశాంతత లేకుండా చేస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవడమో, నివారించడమో చేయకపోతే ఘోరమైన దుష్ప్రభావాలు చవిచూడక మానదు. అందుకు నిలువెత్తు ఉదాహరణ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. అతని చిరునవ్వు కోట్లాదిమంది మనసుల్లో అలజడి రేపే ఆయుధం. అతనికి ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని బాధల సుడిగుండాల్లో చిక్కుకున్నాడో.. కానీ వాటన్నంటినీ గుండెల్లోనే దాస్తూ చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. కానీ కాలం కరుగుతున్న కొద్దీ అతనిపై మానసిక ఒత్తిడి పై చేయి అవుతూ వచ్చింది. అంతిమంగా అతను చావుకు తలొంచుతూ అందరికీ శాశ్వత వీడ్కోలు పలికాడు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..)
నిజంగానే మానసిక ఒత్తిడిని మనం జయించలేమా? అది మనల్ని పొట్టన పెట్టుకునే వరకూ చూస్తూ ఉండాలా? దీనికి ఓ ప్రొఫెసర్ వీడియోతో సమాధానం చెప్పారు. ఆయన ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని విద్యార్థుల ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు అది ఎంత బరువుందని అడగ్గా... విద్యార్థులు రకరకాల సమాధానాలిచ్చారు. దీనికి ఆ ప్రొఫెసర్ బదులిస్తూ.. ‘ఇక్కడ గ్లాసు బరువు అనేది ప్రామాణికం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకుంటున్నామనేది ముఖ్యం. ఓ నిమిషం దాన్ని అలాగే చేతులతో పట్టుకుని ఉంటే ఏమీ అవదు. గంటసేపు పట్టుకుంటే నా చేయి నొప్పి పెడుతుంది. ఇక రోజంతా పట్టుకునే ఉంటే నా చేయి మొద్దుబారిపోయి చచ్చుబడిపోతుంది. (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ )
కానీ వీటన్నింటికి గ్లాసు బరువు కారణం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకున్నామనేదే ముఖ్యం. అలాగే జీవితంలోని ఒత్తిడి కూడా అంతే. అది కూడా నీళ్ల గ్లాసు వంటిదే. కాసేపు వాటి కోసం ఆలోచిస్తే ఏమీ కాదు. కానీ కొంచెం ఎక్కువసేపు ఆలోచించారనుకో అది మిమ్మల్ని బాధిస్తుంది. అదే రోజంతా ఆలోచిస్తూనే ఉన్నారనుకో.. మీరు మొద్దుబారిపోతారు. ఏ పనీ సరిగా చేయలేరు. కాబట్టి చేయాల్సిందొక్కటే గ్లాసు పక్కన పెట్టేసినట్లు వాటి కోసం ఆలోచించడం వదిలేయండి’ అని సెలవిచ్చారు. ఈ వీడియోను టాలీవుడ్ దర్శకుడు దేవా కట్ట ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది తప్పకుండా అనుసరించాల్సిన మార్గమిది.
Comments
Please login to add a commentAdd a comment