
సాక్షి, విశాఖపట్నం : సుషాంత్ సింగ్ మీద ఉన్న అభిమానం ఆమెను ఆత్మహత్య పాల్పడేలా చేసింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా మల్కాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్ పుత్ర నగర్‌కు చెందిన సుమన్ కుమారి టిక్ టాక్ వీడియోలు చూడడం బాగా అలవాటు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ మరణంకు సంబంధించి టిక్ టాక్‌లో తరచూ వీడియోలు చూస్తుండేది. ఈ నేపథ్యంలో సుషాంత్ మృతి పట్ల తీవ్ర ఒత్తిడికి గురైన సుమన్ కుమారి ఇంట్లోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఆదివారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.