
సుశాంత్‌తో అంకిత లోఖండే(పాత చిత్రం)
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణించి మూడేళ్లు దాటిన(2020 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు).. ఇప్పటికీ ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేతో పాటు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రియా చక్రవర్తి.. ఇప్పటికీ సుశాంత్‌ని తలచుకొని బాధపడుతుంటారు. తాజాగా హీరోయిన్ అంకితా లోఖండే..సుశాంత్‌తో బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ని తాను ఎంతగానో ప్రేమించానని, కానీ ఇతరుల మాటలను విని తనకు బ్రేకప్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది.
‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణాలేవి లేవు. సుశాంత్ విడిపోదామని చెప్పగానే నేను షాకయ్యాను. ఆయన నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలోని పరిస్థితులన్నీ మారిపోయాయి. బ్రేకప్ ఎందుకు చెప్పాడో తెలియదు. కానీ అతని నిర్ణయాన్ని మాత్రం తప్పుబట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎదుట వాళ్ల మాటలు విని ఆయన నాకు బ్రేకప్ చెప్పాడేమో అనిపిస్తుంది’అని అంకితా లోఎఖండే చెప్పుకొచ్చింది.
కాగా, సుశాంత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అంకితతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ సీరియల్‌లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుశాంత్ హీరోగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్.. రియా చక్రవర్తితో ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అనుహ్యంగా 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment