సుశాంత్‌ చివరగా కాల్‌ చేసింది అతడికే | Sushant Singh Rajput Made Last Call to Mahesh Shetty | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ చివరగా కాల్‌ చేసింది అతడికే

Published Mon, Jun 15 2020 3:21 PM | Last Updated on Fri, Jun 19 2020 1:11 PM

Sushant Singh Rajput Made Last Call to Mahesh Shetty - Sakshi

స్నేహితుడు మహేష్‌ శెట్టితో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌(ఫైల్‌ఫోటో)

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్య సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ప్రతి ఒక్కరు ఈ వార్త అబద్దమైతే బాగుండు అని కోరకుంటున్నారు.  అయితే చనిపోవడానికి ముందు సుశాంత్‌ తన ఆప్త మిత్రుడు మహేష్‌ శెట్టికి కాల్‌ చేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 9.30 గంటలకు తన సోదరితో మాట్లాడిన అనంతరం సుశాంత్‌, తన స్నేహితుడు మహేష్‌కు కాల్‌ చేశారు. సుశాంత్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మహేష్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈ క్రమంలో మహేష్‌ శెట్టి టీం మెంబర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ మెసేజ్‌ షేర్‌ చేశారు. సుశాంత్‌ మరణం మహేష్‌ను ఎంతో కుంగదీసిందని.. అతడికి కొంత ప్రైవసీ ఇవ్వాల్సిందిగా మీడియాను, జనాలను కోరారు.(రంగుల ప్రపంచం వెనుక విషాదాలెన్నో..)

ఈ క్రమంలో.. ‘సుశాంత్‌ సింగ్‌ ఆకస్మిక మరణం మనందరిని తీవ్ర బాధకు, షాక్‌కు గురి చేసింది. ఈ వార్త మహేష్‌ శెట్టిని ఎంతో కలచివేసింది. అతను తన సోదరుడు, ఆప్త మిత్రుడిని కోల్పోయాడు. సుశాంత్‌ మరణవార్తను అతడు ఇంకా జీర్ణించుకోలోకపోతున్నాడు. ఆ షాక్‌ నుంచి ఇంకా బయటకు రాలేదు. మేము, మహేష్‌ శెట్టి టీం మెంబర్లం అతడి తరపున మిమ్మల్ని, మీడియా వారిని కోరేది ఒక్కటే. ఈ విషాద సమయంలో అతడికి కాస్తా ప్రైవసీ ఇవ్వండి. తేరుకునేందుకు సమయం ఇవ్వండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కోరారు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్‌ సుశాంత్‌..)

మహేష్ శెట్టి‌, సుశాంత్‌ సింగ్‌ టీవీలో నటించిన తొలి సీరియల్‌ ‘కిస్‌ దేశ్‌ మైనే హై మేరా దిల్‌’తో పాటు ‘పవిత్రా రిష్తా’లో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం మహేష్‌ శెట్టి బర్త్‌డే సందర్భంగా సుశాంత్‌ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మేరీ జాన్’ అంటూ విష్‌ చే శారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement