Last Call
-
ఉత్తరాఖండ్ క్రాష్: భార్యకు చివరి కాల్లో ఆ పైలట్..
ముంబై: ఉత్తరాఖండ్ ఘోర విమాన ప్రమాదంలో పైలట్లు, యాత్రికులు మృత్యువాత పడ్డారు. ప్రతికూల వాతావరణంతోనే మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ఓ అంచనాకి వచ్చారు. అయితే.. ప్రమాదానికి ముందు కల్నల్(రిటైర్డ్), పైలట్ అనిల్ సింగ్(57) భార్యతో మాట్లాడిన మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. తూర్పు ఢిల్లీకి చెందిన అనిల్ సింగ్.. కుటుంబంతో పాటు ముంబై(మహారాష్ట్ర) అంధేరీలోని ఓ హౌజింగ్ సొసైటీలో గత పదిహేనుళ్లుగా ఉంటున్నారు. ఆయనకు భార్య షిరిన్ ఆనందిత, కూతురు ఫిరోజా సింగ్ ఉన్నారు. భార్య షిరిన్ ఫిల్మ్ రైటర్.. గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు కూడా. ఇక కూతురు ఫిరోజా.. మీడియాలో పని చేస్తోంది. అయితే.. ప్రమాదం కంటే ముందు రాత్రి అంటే సోమవారం రాత్రి ఆయన తన భార్యకు ఫోన్ చేసి పలు జాగ్రత్తలు సూచించినట్లు ఆనందిత తెలిపారు. ఆనందిత మాట్లాడుతూ.. గత రాత్రి ఆయన మాకు ఫోన్ చేశారు. ఫిరోజాకు ఆరోగ్యం బాగోలేదని ఆరా తీశారు. బిడ్డ జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశారు. అవే ఆయన చివరి మాటలు అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఇది ప్రమాదంగానే భావిస్తున్నామని, కుట్ర కోణంతో ఫిర్యాదు చేసే ఆలోచనలో లేమని ఆమె వెల్లడించారు. కూతురితో పాటు ఢిల్లీలో జరగబోయే భర్త అంత్యక్రియలకు ఆమె బయలుదేరారు. 2021 నవంబర్‌లో మహారాష్ట్ర గడ్చిరోలిలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో గాయపడ్డ పోలీస్ సిబ్బందిని తరలించడంలో అనిల్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. మరోవైపు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన చాపర్ బెల్ 407(VT-RPN) కేదర్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి యాత్రికులను తీసుకెళ్లే క్రమంలో దేవ దర్శిని(గరుడ్ ఛట్టి) వద్ద ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణంతో కొండ ప్రాంతాల్లో అది పేలిపోయి ప్రమాదానికి గురై ఉంటుందని రుద్రప్రయాగ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై డీజీసీఏ తోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సైతం దర్యాప్తు చేపట్టింది. -
నాన్నా.. కొడుతున్నాడు! : అదే చివరి మాట
పన్నెండేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొంది. తాగుడుకు బానిసైన భర్తలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అంతలోనే పిల్లలు పుట్టడంతో వారి భవిష్యత్ కోసమైనా బతకాలని భరిస్తూ వచ్చిన ఆమె శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన కర్నూలులోని కౌతాళం మండల పరిధిలోని లింగాలదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. సాక్షి, కౌతాళం రూరల్: కౌతాళం మండల కేంద్రానికి చెందిన హరిజన గౌరప్ప, పెద్ద బోడెమ్మ కూతురు బుజ్జమ్మ(30)ను సమీప బంధువు లింగాలదిన్నె గ్రామానికి చెందిన హరిజన అబ్రహం, యమిలమ్మ కుమారుడు జాన్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరి సంసారం నాలుగేళ్లు అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత భర్త జాన్ తాగుడుకు బానిసై భార్యను వేధించడం మొదలు పెట్టాడు. వీరికి నలుగురు మగ పిల్లలు. అయినా భర్తతో పాటు అత్త, మామ, ఆడపడచు భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఉండటంతో తల్లిదండ్రులకు చెప్పుకుని విలపించేది. సంసారం ఆగం చేసుకోవద్దని వారు చెప్పే మాటలు, నలుగురు పిల్లల భవిష్యత్‌ను తలచుకుని భరిస్తూ వచ్చేది. (ఆదోనీలో పరువు హత్య కలకలం) బుజ్జమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు ఈ క్రమంలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో భర్త తాగి వచ్చి కొడుతుండటంతో తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా.. కొడుతున్నాడు’ అంటూ చెప్పింది. అవే ఆఖరి మాటలయ్యాయి. వెంటనే ఫోన్ కట్ కావడంతో తండ్రి తిరిగి కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇలాంటి వేధింపులు గతంలోనే చూసిన అతను మిన్నకుండిపోయాడు. అర్ధరాత్రి కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పక్కింటి వాళ్ల నుంచి ఫోన్ ద్వారా సమారాచారం తెలుసుకుని గుండెలు బాదుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన లింగాలదిన్నె చేరుకుని బోరున విలపించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో భర్త, అత్తమామలే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, హత్యనా, ఆత్మహత్మనా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. కాగా అమ్మ కావాలంటూ ఏడుస్తున్న చిన్నారులను చూసి పలువురు కన్నీరు పెట్టుకున్నారు. -
సుశాంత్ చివరగా కాల్ చేసింది అతడికే
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ప్రతి ఒక్కరు ఈ వార్త అబద్దమైతే బాగుండు అని కోరకుంటున్నారు. అయితే చనిపోవడానికి ముందు సుశాంత్ తన ఆప్త మిత్రుడు మహేష్ శెట్టికి కాల్ చేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 9.30 గంటలకు తన సోదరితో మాట్లాడిన అనంతరం సుశాంత్, తన స్నేహితుడు మహేష్‌కు కాల్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మహేష్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. ఈ క్రమంలో మహేష్ శెట్టి టీం మెంబర్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ మెసేజ్ షేర్ చేశారు. సుశాంత్ మరణం మహేష్‌ను ఎంతో కుంగదీసిందని.. అతడికి కొంత ప్రైవసీ ఇవ్వాల్సిందిగా మీడియాను, జనాలను కోరారు.(రంగుల ప్రపంచం వెనుక విషాదాలెన్నో..) ఈ క్రమంలో.. ‘సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం మనందరిని తీవ్ర బాధకు, షాక్‌కు గురి చేసింది. ఈ వార్త మహేష్ శెట్టిని ఎంతో కలచివేసింది. అతను తన సోదరుడు, ఆప్త మిత్రుడిని కోల్పోయాడు. సుశాంత్ మరణవార్తను అతడు ఇంకా జీర్ణించుకోలోకపోతున్నాడు. ఆ షాక్ నుంచి ఇంకా బయటకు రాలేదు. మేము, మహేష్ శెట్టి టీం మెంబర్లం అతడి తరపున మిమ్మల్ని, మీడియా వారిని కోరేది ఒక్కటే. ఈ విషాద సమయంలో అతడికి కాస్తా ప్రైవసీ ఇవ్వండి. తేరుకునేందుకు సమయం ఇవ్వండి’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా కోరారు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) View this post on Instagram A post shared by Mahesh Shetty (@memaheshshetty) on Jun 14, 2020 at 10:16pm PDT మహేష్ శెట్టి, సుశాంత్ సింగ్ టీవీలో నటించిన తొలి సీరియల్ ‘కిస్ దేశ్ మైనే హై మేరా దిల్’తో పాటు ‘పవిత్రా రిష్తా’లో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం మహేష్ శెట్టి బర్త్‌డే సందర్భంగా సుశాంత్ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మేరీ జాన్’ అంటూ విష్ చే శారు. -
'రేయ్.. శ్రీమంతానికి వచ్చి పోరా'
- చింటూ, మేయర్ అనూరాధ మధ్య చివరి సంభాషణ చిత్తూరు (అర్బన్) : చిత్తూరులో జరిగిన మేయర్ దంపతుల హత్యకేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న దుండగులతో పాటు మేయర్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే మేనల్లుడు చింటూతో మనస్పర్థలు ఉన్నా.. మేయర్ అనూరాధ అతనికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు. మేయర్ దంపతుల కోడలు హేమలత (కఠారి ప్రవీణ్ భార్య)కు నవంబరు ఒకటో తేదీన ఇరువారంలోని ఓ మండపంలో శ్రీమంతం నిర్వహించారు. ఈ శుభకార్యానికి రావాల్సిందిగా ముందురోజు మేయర్ అనూరాధ స్వయంగా చింటూకు ఫోన్ చేశారు. ‘‘రేయ్.. పాప (హేమలత)కు శ్రీమంతం చేస్తా ఉండాము. తప్పకుండా వచ్చి పోరా..’’ అని ఫోన్లో చెప్పారు. దీనికి చింటూ సమాధానం ఇస్తూ. ‘‘నేను వచ్చేది మళ్లీ, ముందు నీ మొగుడ్ని జాగ్రత్తగా చూసుకో’’ అని ఫోన్ పెట్టేశాడు. అయిన వాడు, అందులోనూ అసంతృప్తితో ఉన్నాడు. మనల్ని ఏం చేస్తాడులే.. అనుకుని మేయర్ దంపతులు ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో.. ఘోరం జరిగిపోయింది. అనుచరులకు చింటూ భారీ నజరానాలు.. తననే నమ్ముకున్న అనుచరులకు చింటూ భారీ నజరానాలు ఇచ్చాడా..? చిత్తూరు మేయర్ దంపతుల హత్యకు ఆరు నెలల క్రితమే రూ.50 లక్షలను చింటూ తన అనుచరులకు పంపిణీ చేసినట్లు సమాచారం. మేయర్ హత్య కేసులో లొంగిపోయిన వెంకటాచలపతి, జయప్రకాష్, మంజునాథ్‌లను విచారించగా వాళ్లు చెప్పిన సమాధానాలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. పేద కుటుంబానికి చెందిన తనకు చింటూ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశాడని జయప్రకాష్, రాళ్లు కొట్టి పనిచేసే తనకు రూ.13 లక్షలు ఇచ్చాడని మంజునాథ్, కఠారి మోహన్ తనను ఛీ కొడితే చింటూ చేరదీసి తనకు రూ.18 లక్షలు ఇచ్చినట్లు వెంకటాచలం పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.