ఆకట్టుకుంటున్న ‘కేదార్‌నాథ్‌’ ట్రైలర్‌ | Kedarnath Movie Trailer Released | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘కేదార్‌నాథ్‌’ ట్రైలర్‌

Published Mon, Nov 12 2018 4:54 PM | Last Updated on Mon, Nov 12 2018 5:01 PM

Kedarnath Movie Trailer Released - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ సారా అలీఖాన్‌(సైఫ్‌ అలీఖాన్‌- అమృతా సింగ్‌ కుమార్తె‌)ను సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న సినిమా కేదార్‌నాథ్‌. 2013లో చార్‌ధామ్‌ ప్రాంతంలో ముఖ్యంగా కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అభిషేక్‌ కపూర్‌ దర్శకుడు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేసింది మూవీ యూనిట్‌.

కేదార్‌నాథ్‌ యాత్ర ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ మొదలైన ట్రైలర్‌ సారా- సుశాంత్‌ల పరిచయం, వారి ప్రేమ గురించి తెలిసిన పెద్దలు తీసుకున్న నిర్ణయం తదితర అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. ఆలయ పరిసరాలను వరద ముంచెత్తడం, సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. హిందూ యువతి- ముస్లిం యువకుడి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement