ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బేచారా. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో భావేద్వేగానికి గురి చేసింది. హాట్‌స్టార్+డిస్నీలో విడుదలైన ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. ఈ చిత్రాన్ని విడుదలైన 24 గంటల్లో 95 మిలియన్ల మంది వీక్షించారు. ఇది ప్రముఖ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ ’ వ్యూస్‌ను మించి ఉందని ప్రముఖ మీడియా కన్సల్టింగ్ ఫార్మ్ ఆర్ మ్యాక్స్ మీడియా తెలిపింది. చదవండి: దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్
సుశాంత్ గౌరవార్థం ఈ సినిమాను సబ్‌స్రైబర్స్, నాన్ సబ్‌స్రైబర్స్ కు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు హాట్‌స్టార్+ డిస్నీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ సుశాంత్ సినిమా థియేటర్లలో విడుదలై టికెట్ ధర రూ. 100 చొప్పున కొని చూసి ఉంటే 950 కోట్ల బిజినెస్ చేసేది. పీవీఆర్ సినిమా థియేటర్లలలో టికెట్ ధర రూ. 207 చొప్పున ఉంటుంది కాబట్టి అక్కడ చూసి ఉంటే బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 2000కోట్లు దాటేది. సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment