ముంబై: యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సెలబ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తన ట్విటర్ ఖాతాను కొందరు సస్పెండ్ చేస్తున్నారని, మూవీ మాఫియా కుట్రతోనే ఇదంతా జరుగుతుందని కంగనా ఆరోపిస్తుంది.
బాలీవుడ్‌లో నెపోటిజం వేళ్లూనుకుపోయిందంటూ, ప్రతిభ ఉన్న వాళ్లకు ప్రాధాన్యం ఉండదని, కేవలం స్టార్ కిడ్స్‌కు మాత్రమే అవకాశాలు, అవార్డులు ఉంటాయని ఆమె ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వారిలో కంగనా ముందు వరుసలో నిలిచారు.
చదవండి: ‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’
Comments
Please login to add a commentAdd a comment