సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని నెలలు గడుస్తున్న ఆయన కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ సుశాంత్‌కు న్యాయం జరగాలంటూ పోరాడుతూనే ఉన్నారు. సామాజక మాధ్యమాల ద్వారా ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ న్యాయం కోసం తపిస్తున్నారు. సుశాంత్ మరణించిన నాటి నుంచి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇక దీంతో పాటు బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం, స్టార్ కిడ్స్‌పై వ్యతిరేకత కూడా అదే రేంజ్‌లో పెరుగుతూ వస్తుంది. బాలీవుడ్ ఈ వ్యతిరేకతను కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ మూమెంట్ ఉదృతంగా సాగుతుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన బ్రిటన్‌లోని మల్టీప్లెక్స్‌ల ముందు నిరసన తెలియజేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ ఆన్‌లైన్ ద్వారా ఈ నిరసనలో పాలుపంచుకోబోతున్నారు. సుశాంత్ సోదరి శ్వేత సింగ్ ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ సుశాంత్ క్యాంపెయిన్ జరుగుతున్న విషయం తెలిసిందే. వారందరూ సీబీఐ సుశాంత్ మరణం వెనుక ఉన్న వ్యక్తులను, నిజాలను బయటకు తీసుకురావాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతూ, బాలీవుడ్ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం ఫ్యాన్స్ అని ఆ విషయాన్ని స్టార్స్‌గా ఎదిగిన వారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్‌లు మర్చిపోకూడదు అని అన్నారు. దీంతో నిరసన సెగలు వీధుల నుంచి సినిమా హాల్ సీట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఇతర స్టార్ కిడ్స్ సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా వారి వీడియోలను డిస్‌లైక్ చేయాలంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. దేశాన్ని దాటి ఖండాతరాలలో కోసం ఇలా జరగడంతో బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment