
బాలీవుడ్‌లో పెద్దల పెత్తనాన్ని ఎండగడుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే బాలీవుడ్‌లో ప్రోత్సాహం లభిస్తుందా? అంటూ సినీ ప్రముఖుల తీరును విమర్శిస్తున్నారు. బంధుప్రీతిపై మండిపడుతున్న సినీ ప్రేక్షకలోకం ఒక్కసారిగా గొంతెత్తి ప్రశ్నించడానికి కారణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. 'అతని ప్రతిభకు గుర్తింపు లేదు, అతడిని పైకి రాకుండా అణగదొక్కారు!' అంటూ ఆయన అభిమానులు కడుపు మంటతో రగిలిపోతున్నారు. దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైన సెలబ్రిటీలను అన్‌ఫాలో అవుతూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. (సల్మాన్‌ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీ)
ఈ సెగ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కూ తగిలింది. దీనిపై సల్మాన్ తొలిసారిగా స్పందించాడు. సుశాంత్ ఫ్యాన్స్‌కు మద్దతుగా ఉండాలని తన అభిమానులను కోరాడు. ఈమేరకు శనివారం రాత్రి ట్వీట్ చేశాడు. "అభిమానులందరికీ ఓ విజ్ఞప్తి. మీరందరూ సుశాంత్ అభిమానులకు మద్దతుగా నిలబడాలి. ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకోవడం సరికాదు. వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోండి.. ప్రేమించే వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్న సుశాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు తోడుగా ఉండండి" అని అభ్యర్థించాడు. (ఐ వాన్న అన్‌ఫాలో యు)
Comments
Please login to add a commentAdd a comment