ముంబాయి: సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా అందరిని ఎంత శోకసంద్రంలో ముంచిదో తెలిసిందే. సుశాంత్ మరణానికి సంబంధించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సుశాంత్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే తనని తాను సన్నద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోవడానికి మూడు రోజుల ముందే ఇంట్లో పనివారిని, తాను డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేసినట్లు ఇంట్లో పనివారు పోలీసులకు తెలిపారు.
('సుశాంత్ కాంట్రాక్ట్ ముగిసింది.. నువ్వు కూడా')
ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువే ఇచ్చి ఇంకా తాను వారికి జీతాలు ఇవ్వలేనని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఇన్ని రోజులు తన బాగోగులు చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఆర్థికంగా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇంట్లో పనివారు కరోనా కారణంగా ఇబ్బంది పడటం చూసి వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే సాయం చేయడం బట్టే సుశాంత్ మంచి తనం అర్థం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. (సుషాంత్ మరణం టిక్‌టాక్‌లో చూసి..)
Comments
Please login to add a commentAdd a comment