
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను తొలగించడానికి అమెరికా మీడియా సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్‌కు తెలిపింది. ఈ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను శ్వేత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో కొన్ని బిల్ బోర్డులను అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచారం ద్వారా ఆయనతో సంబంధం ఒక మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆ మీడియా సంస్థ మెయిల్‌లో తెలిపింది. ఆ కారణంగానే ఆ బిల్ బోర్డులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది.
It seems the paid PR has it’s reach everywhere. Hollywood Billboard company reached out telling they will not keep the Billboard any longer! The wordings on the billboard only demanded fair trial and justice! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR pic.twitter.com/YrMrLH3eIX
— shweta singh kirti (@shwetasinghkirt) September 3, 2020
దీనిపై శ్వేత సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెయిడ్ పీఆర్ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తోంది. ఈ కారణంగానే హాలీవుడ్ బిల్‌బోర్డు సంస్థ సుశాంత్ బిల్‌బోర్డును తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బిల్‌బోర్డు ద్వారా న్యాయమైన విచారణ, న్యాయం మాత్రమే కోరుతున్నాము! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR అని ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 వ తేదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తరువాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment