సుశాంత్‌ మృతికి కారణం తెలుసు: నటుడు | Gulshan Devaiah Reacts To Meera Chopra Tweet And Said Bollywood Is Not a Family | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక‌ కుటుంబం కాదు

Published Tue, Jun 16 2020 2:02 PM | Last Updated on Tue, Jun 16 2020 2:43 PM

Gulshan Devaiah Reacts To Meera Chopra Tweet And Said Bollywood Is Not a Family - Sakshi

ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ‌ కుటుంబం​ కాదని.. అది కేవలం ఊహాత్మకమైన పేరు మాత్రమేనంటూ నటుడు గుల్షాన్‌ దేవయ్య మంగళవారం ట్వీట్‌ చేశాడు. నటి మీరా చోప్రా యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై స్పందిస్తూ బాలీవుడ్‌ పరిశ్రమ ఒక కుటుంబం అంటూ చేసిన ట్వీట్‌కు‌ గుల్షాన్‌ రీట్వీట్‌ చేశాడు. ‘బాలీవుడ్‌ పరిశ్రమ ఒక కుటుంబం అంటారు. కానీ అది అందరికి కాదు. ఎప్పటికీ కాదు కూడా. కుటుంబం అనుకుంటే సమస్యలు వస్తాయి. పని చేసే ప్రదేశం కాబట్టి అది ఒక ఊహత్మక పేరు మాత్రమే. అయితే ఇది నేను ఎవరినీ ఉద్దేశించి అనడం లేదు. నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. ఒకవేళ ఈ ట్వీట్‌ ఎవరినైనా ఉద్దేశించినట్లు ఉంటే నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. (సుశాంత్‌ ఇంట మరో విషాదం)

గుల్హాన్‌ సోమవారం చేసిన ట్వీట్‌లో ‘‘సుశాంత్‌ ఎందుకు ఇలా చేశాడో ఆలోచిస్తే నటీ నటులందరికి అర్ధం అవుతుంది. తన మరణానికి కారణం బాలీవుడ్‌లోని ప్రతిఒక్కరికి తెలుసు. ఇదే ఎక్కువగా బాధించే విషయం. సుశాంత్‌ మరణవార్త ప్రతి ఒక్కరిని దిగ్బ్రాంతికి గురిచేసింది’’ అంటు రాసుకొచ్చాడు. కాగా సుశాంత్‌కు బాలీవుడ్‌ క్షమాపణలు చెప్పాల‍ంటూ నటి మీరా చొప్రా సోమవారం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘‘అవును ఇది నిజం.. బాలీవుడ్‌ అనేది ఒక కుటుంబం. కానీ ఈ కుటుంబం నీకు అవసరమైన సమయంలో నీతో లేదు. క్షమించు సుశాంత్’‌’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. కాగా సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో మానసిక ఒత్తిడి ​కారణంగా ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది మంది బాలీవుడ్‌, టీవీ నటీనటుల మధ్య సోమవారం ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement