ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఈ యంగ్ హీరో మరణంతో ఇండస్ట్రీలోని అనేక చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్‌లో నెపోటిజమ్‌పై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ కొనసాగుతోంది. ఇండస్ట్రీలో వారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా బాలీవుడ్ స్థార్ దీపికా పదుకొనే సుశాంత్ మరణంపై ఓ ఫోటోగ్రాఫర్‌పై మండిపడ్డారు. (సల్మాన్ ట్వీట్: విమర్శలు గుప్పించిన సింగర్!)
ఇండస్ట్రీలో ఫోటో గ్రాఫర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను అభిమానులకు చేరవేయడంతో వీరు ముందుంటారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు వారిని క్లిక్మనిపించేందుకు తెగ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ అంతియ యాత్రకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో సుశాంత్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై సదరు ఫోటోగ్రాఫర్ ఇలా పేర్కొన్నాడు. దయచేసి నా ఫోటోలు లేదా వీడియోలను నా అనుమతి లేకుండా ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ పోస్ట్ చేయరాదు' అంటూ రాసుకొచ్చారు. (జీవితం చాలా చిన్నది నన్బా : కీర్తి)
అయితే దీనిపై స్పందించిన దీపికా పదుకొనే.. 'అవునా. మీకు ఈ వీడియో తీయడం సరైనదేనా?. సుశాంత్ కుటుంబం అనుమతి లేకుండా దీనిని సోషల్ మీడియోలో పోస్ట్ చేయడమే కాకుండా దీని ద్వారా డబ్బు సంపాదించడం భావ్యమేనా..' అంటూ దీపికా ప్రశ్నించారు. ఇక దీపికా మాట్లాడిన తీరుపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇలాంటి విషయాన్ని ప్రస్తావించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. (సుశాంత్ నెలకు ఎంత ఖర్చు చేస్తారంటే..?)
Comments
Please login to add a commentAdd a comment